Most talented rasis: ఈ రాశుల వారు మస్తు ట్యాలెంటెడ్.. ఎప్పుడూ అవకాశాలు వస్తాయి, పట్టుదలతో ఉంటారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. రాశులు వ్యక్తిత్వాన్ని తెలపడంతో పాటుగా వారి విజయాలు, అవకాశాలు గురించి కూడా తెలుపుతాయి. కొన్ని రాశుల వారు ఎంతో క్రియేటివ్‌గా, క్రమశిక్షణతో ఉంటారు. కొన్ని రాశుల వారు మాత్రం అన్నిట్లో ముందే ఉంటారు. ఎప్పుడూ అవకాశాలు వస్తాయి.
రాశుల ఆధారంగా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. రాశుల ప్రకారం కొన్ని రాశుల వారు కొన్నిటిలో ముందుంటే, కొన్ని రాశుల వారు అందులోనే వెనుక ఉంటారు. ఒకరి బలాలు మరొకరి బలహీనతలు అవ్వచ్చు. రాశుల ఆధారంగా భవిష్యత్తు, ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటుగా వారి వ్యక్తిత్వం గురించి కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఈ రాశుల వారు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. రాశులు వ్యక్తిత్వాన్ని తెలపడంతో పాటుగా వారి విజయాలు, అవకాశాలు గురించి కూడా తెలుపుతాయి. కొన్ని రాశుల వారు ఎంతో క్రియేటివ్‌గా, క్రమశిక్షణతో ఉంటారు. కొన్ని రాశుల వారు మాత్రం అన్నిట్లో ముందే ఉంటారు.
ఈ రాశుల వారు మల్టీ టాలెంటెడ్
ఈ రాశుల వారు మాత్రం మల్టీ టాలెంటెడ్. అన్నిట్లో కూడా ముందుంటారు. వీరిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మరి ఇక వీరిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి.
1.మేష రాశి:
మేష రాశి వారు ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. సృజనాత్మక ప్రాజెక్టుల్లో అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు క్రియేటివ్ ఫీల్డ్‌లో కూడా ప్రతిభను చూపుతారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి టాలెంట్‌తో ఇతరులను కూడా ప్రతిభావంతులుగా మారుస్తారు.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి సృజనాత్మకత, వినోదాత్మక ప్రతిభ ఎక్కువగా ఉంటుంది. నటన, డాన్స్, కళారంగంలో వారి ప్రతిభను చూపిస్తారు. ఎల్లప్పుడూ ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. సింహ రాశి వారిని కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
3.తులా రాశి:
తులా రాశి వారికి పని చేసే సామర్థ్యం, న్యాయపరమైన ఆలోచన, సమస్యలను పరిష్కరించే అద్భుతమైన గుణాలు ఉండటంతో ఎప్పుడూ ముందుంటారు. మానసిక సమతుల్యత, వివేకం వీరి బలం. ఆర్ట్, డిజైనింగ్, ఇంటీరియర్, ఫ్యాషన్ లాంటి రంగాల్లో బాగా రాణిస్తారు.
4.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు కూడా మల్టీ టాలెంటెడ్. పైగా కొత్త విషయాలను ఎప్పుడూ ట్రై చేయడానికి రెడీగా ఉంటారు. ట్రావెల్, అడ్వెంచర్ రంగాల్లో బాగా రాణిస్తారు. సానుకూల దృక్పథంతో ఉంటారు.
5.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు సైకాలజీ, రీసెర్చ్, అనలిటికల్ ఫీల్డ్‌లో బాగా రాణిస్తారు. శ్రద్ధ, లోతైన అవగాహన ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు వెనుక ఉన్న నిజాన్ని త్వరగా గుర్తిస్తారు. పట్టుదల కూడా ఎక్కువే. ధైర్యంగా ముందుకు వెళ్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












