నవరాత్రుల్లో ఈ పరిహారం చేస్తే కోరుకున్న ఉద్యోగం మీ సొంతం!
నవరాత్రి రోజులు అమ్మవారి అనుగ్రహం పొందడానికి అత్యంత పవిత్రమైన సమయమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కోరుకున్న ఉద్యోగం సాధించాలనుకునేవారు వరుసగా మూడు రోజుల పాటు రాత్రివేళ అమ్మవారికి ఎర్రని పూలు సమర్పించి, దుర్గా సప్తశతి ఏడవ అధ్యాయాన్ని పఠించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన ఉద్యోగం దక్కడం కొందరికి కత్తి మీద సాములా మారుతుంది. చాలామంది తాము చేస్తున్న ఉద్యోగాన్ని మార్చుకోవడానికి మెరుగైన అవకాశాల కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తుంటారు.

అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవరాత్రి సమయం కేవలం పూజలకు మాత్రమే కాదు, మన అదృష్టాన్ని మరియు భవిష్యత్తును మార్చుకోవడానికి అత్యంత శక్తివంతమైన కాలం. నవరాత్రి రోజుల్లో భక్తిభావంతో ఆ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలోని సమస్త ఆటంకాలు తొలగిపోతాయని ప్రతీతి.
ఉద్యోగం సాధించడానికి నవరాత్రి ప్రత్యేక పరిహారం
జ్యోతిష్య నిపుణుల సూచన ప్రకారం, మనసైన ఉద్యోగం దక్కాలని కోరుకునే వారు నవరాత్రి రోజుల్లో ఒక చిన్న కానీ అత్యంత ప్రభావవంతమైన పూజా విధానాన్ని ఆచరించాలి. వరుసగా ఏవైనా మూడు రోజుల పాటు రాత్రి సమయాల్లో వీటిని పాటించవచ్చు.
ప్రతి రోజు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి, ఆపై 'దుర్గా సప్తశతి' గ్రంథంలోని ఏడవ అధ్యాయాన్ని పఠించాలి. నిష్టతో, పరిపూర్ణ విశ్వాసంతో ఈ పరిహారం చేస్తే దుర్గా మాత అనుగ్రహం లభించి కోరుకున్న ఉద్యోగం త్వరలోనే చేతికి అందుతుందని నమ్ముతారు.
దసరా రోజున అమ్మవారి వాహన విశేషాలు
శరన్నవరాత్రుల ముగింపు రోజైన విజయదశమి రోజున అమ్మవారు భూలోకం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఏ వాహనంపై ప్రయాణిస్తారనే దాని ఆధారంగా దేశంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది జ్యోతిష్య శాస్త్రం అంచనా వేస్తుంది. ఈ ఏడాది అమ్మవారి రాక గజం (ఏనుగు) మీద జరగడం ఎంతో శుభదాయకం. అయితే, దసరా నాడు ఏ రోజు వస్తుందనే దానిని బట్టి అమ్మవారి వాహనం మారుతుంది.
ఆదివారం లేదా సోమవారం దశమి వస్తే మహిషం మీద, శనివారం లేదా మంగళవారం వస్తే కోడి మీద అమ్మవారు వెళ్తారు. ఇది సమాజంలో కష్టాలను, అశాంతిని సూచిస్తుంది. బుధవారం లేదా శుక్రవారం అయితే ఏనుగు మీద, గురువారం అయితే మనిషి మీద ప్రయాణించి సుఖ శాంతులను ప్రసాదిస్తుంది.
ఈ ఏడాది ముగింపు వాహనం ఏది?
ఈ ఏడాది అక్టోబర్ 20, 2026వ తేదీ మంగళవారం నాడు విజయదశమి వచ్చింది. ఈ క్రమంలో అమ్మవారి ప్రయాణం కోడి వాహనంపై జరగనుంది. దీనివల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు, కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఏదేమైనా, భక్తులు భయపడకుండా దేవీ అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేయడం శ్రేయస్కరం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


