నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవి పూజ.. ఇలా అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాలుగా లాభాలే!

నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవిని ఆరాధించడం విశిష్టమైనదిగా భావిస్తారు. గాయత్రీ దేవి జ్ఞానం, పవిత్రత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. ఈ సందర్భంగా అమ్మవారి పూజా స్థలాన్ని శుభ్రం చేసి, దీపారాధన చేసి, పూలు, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించాలి. 

Published on: Oct 12, 2026, 09:30:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవిని పూజించాలి. గాయత్రీ అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజించి, రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. గాయత్రీ దేవిని ఈరోజు ఆరాధించేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రాలు, పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవి పూజ.. ఇలా అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాలుగా లాభాలే! (AI)
నవరాత్రుల రెండో రోజు గాయత్రీ దేవి పూజ.. ఇలా అమ్మవారిని ఆరాధిస్తే అన్ని విధాలుగా లాభాలే! (AI)

గాయత్రీ దేవి పూజ చేయడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గాయత్రీ దేవి జ్ఞానం, పవిత్రత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. గాయత్రీ దేవిని ఆరాధిస్తే ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది. నవరాత్రుల్లో గాయత్రీ దేవిని ఎలా పూజించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు గాయత్రీ దేవి ఎవరు?

గాయత్రీ దేవిని వేదమాతగా ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రం శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రం సూర్యుని దివ్య తేజస్సును ధ్యానిస్తూ, బుద్ధిని సన్మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తుంది అని పండితులు తెలిపారు.

గాయత్రీ దేవి పూజ చేసేటప్పుడు వీటిని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి

పూజా స్థలాన్ని శుభ్రం: గాయత్రీ దేవిని ఆరాధించడానికి ముందు పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని, గాయత్రీ దేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టండి.

దీపారాధన చేయండి: నెయ్యి లేదా నూనెతో దీపారాధన చేయండి. గణపతిని కూడా స్మరించుకోండి.

పూలను సమర్పించండి: అమ్మవారికి భక్తితో పూలను సమర్పించండి. అలాగే దీప, ధూప నైవేద్యాలు, పసుపు, కుంకుమలు, అక్షతలను కూడా సమర్పించండి.

గాయత్రీ మంత్రాన్ని ప్రశాంతంగా ఒకచోట కూర్చుని జపించండి. ఈ మంత్రాన్ని 11, 21 లేదా 108 సార్లైనా జపించవచ్చు. నైవేద్యం సమర్పించాక చివరిగా హారతి ఇవ్వండి.

గాయత్రీ దేవికి పాలు, పాయసం, ఇంట్లో తయారు చేసిన సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.

నవరాత్రుల్లో గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తే మంచిది?

ఉదయం సూర్యోదయం సమయంలో గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. లేదంటే సాయంత్రం కూడా ప్రశాంతంగా కూర్చుని గాయత్రీ మంత్రాన్ని జపించవచ్చు. నవరాత్రుల్లో వీలైన సమయంలో భక్తితో ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.

గాయత్రీ దేవి పూజ వలన కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు

గాయత్రీ దేవిని ఆరాధించడం వలన ఏకాగ్రత, ఆత్మపరిశీలన అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు కోసం ఈ మంత్రాన్ని రోజూ జపించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More