నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలను ఆరాధించి, మంచి జరగాలని, అనుకున్నవన్నీ జరగాలని ప్రార్థిస్తారు. అయితే, నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటికి వీటిని తీసుకురండి. ఈ వస్తువులు అమ్మవారి అనుగ్రహం కోసం సహాయపడతాయి. మరి, ఎలాంటి వస్తువులను నవరాత్రులకు ముందు ఇంటికి తీసుకురావాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రులకు ముందు ఇంటికి తీసుకు రావాల్సిన వస్తువులు

శారదీయ నవరాత్రులు అత్యంత పవిత్రమైన పర్వదినాలుగా భావిస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటికి ఈ వస్తువులను తీసుకురండి. ఇవి తీసుకురావడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కలశం
నవరాత్రి పూజలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూజా విధానాన్ని బట్టి కలశాన్ని తీసుకురండి. రాగి, ఇత్తడి, వెండి కలశాన్ని ఉపయోగించవచ్చు.
పసుపు, కుంకుమలు
అమ్మవారి పూజలో చాలా ముఖ్యమైనవి పసుపు, కుంకుమలు. ఇవి రెండింటినీ కూడా నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటికి తీసుకువచ్చి సిద్ధం చేసుకోండి.
వెండి నాణేలు
లక్ష్మీదేవి పూజలో వెండి నాణేలను ఉపయోగిస్తారు. కుదిరితే వెండి నాణేలను కూడా సమకూర్చుకోండి.
గోమతి చక్రాలు
గోమతి చక్రాలను పూజలో ఉపయోగిస్తారు. వీటిని నవరాత్రులకు ముందు ఇంటికి తీసుకు వచ్చి పెట్టండి. ఇవి కూడా శుభ ఫలితాలను కలిగిస్తాయి.
నవరాత్రులు ప్రారంభానికి ముందు ఈ వస్తువులను కూడా సిద్ధం చేసుకోండి:
అమ్మవారి పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, మామిడి ఆకులు, దీపాలు, దీపాలకు ఉపయోగించే నూనె లేదా నెయ్యి, తోరణాలు, పువ్వులు, పూల మాలలు, పూజా సామాగ్రి, ధాన్యాలు, ఎర్రటి వస్త్రం, అమ్మవారికి కావాల్సిన చీర, కుంకుమ భరణి, పసుపు కొమ్ములు, అక్షింతలు, చందనం, కర్పూరం, శంఖం, పంచపాత్ర, ఉద్ధరిణి, నైవేద్యానికి కావాల్సిన సామాగ్రి ఇవి. పూజా పుస్తకాలు కూడా చాలా ముఖ్యమైనవి. దుర్గా సప్తశతి, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం ఉండే పుస్తకాలను కూడా సిద్ధం చేసుకోండి.
కన్యా పూజ
నవరాత్రుల్లో కన్యా పూజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్యా పూజ చేసేటప్పుడు చిన్నారులకు ఇవ్వవలసిన వస్తువులను కూడా సమకూర్చుకోండి. పిల్లలకు బట్టలు, పసుపు, కుంకుమలు, చిన్న బహుమతులు, అలంకరణ సామాగ్రి, పండ్లు, ప్రసాదాలు వంటివి ఇస్తారు.
{{/usCountry}}నవరాత్రుల్లో కన్యా పూజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్యా పూజ చేసేటప్పుడు చిన్నారులకు ఇవ్వవలసిన వస్తువులను కూడా సమకూర్చుకోండి. పిల్లలకు బట్టలు, పసుపు, కుంకుమలు, చిన్న బహుమతులు, అలంకరణ సామాగ్రి, పండ్లు, ప్రసాదాలు వంటివి ఇస్తారు.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.