శరన్నవరాత్రులు 2026: రేపటి నుంచి దేవీ నవరాత్రులు.. మొదటి రోజు అమ్మవారిని ఇలా పూజించండి!

2026 అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజిస్తారు. ఘటస్థాపనతో పూజను ప్రారంభించి, దీపారాధన, పుష్పాలు, గంధం, ధూపం, నైవేద్యాలను సమర్పించాలి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

Published on: Oct 10, 2026, 13:11:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులను జరుపుకుంటాము. ఈ ఏడాది దేవీ నవరాత్రులు అక్టోబర్ 11, అంటే రేపటి నుంచి మొదలవుతాయి. దేవీ నవరాత్రులలో మొదటి రోజు ఆరాధించేది పర్వతరాజు కుమార్తె అయిన శైలపుత్రి దేవిని. పార్వతీ దేవిని ఈ నామంతో ఆరాధించడం జరుగుతుంది. వృషభ వాహనంపై, త్రిశూలం, పద్మంతో దర్శనమిస్తారు.

శరన్నవరాత్రులు 2026: రేపటి నుంచి దేవీ నవరాత్రులు.. మొదటి రోజు అమ్మవారిని ఇలా పూజించండి! (AI)
శరన్నవరాత్రులు 2026: రేపటి నుంచి దేవీ నవరాత్రులు.. మొదటి రోజు అమ్మవారిని ఇలా పూజించండి! (AI)

శరన్నవరాత్రులు 2026

శరన్నవరాత్రులు శుక్ల పాడ్యమితో మొదలవుతాయి. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి వసంత నవరాత్రులను విశేషంగా జరుపుకుంటాము. మొదటి రోజు ఘటస్థాపన తర్వాత పద్ధతి ప్రకారం పూజ చేయాలి. మొదటి రోజు అమ్మవారిని ఇలా ఆరాధించండి. విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఇలా నవరాత్రుల పూజను మొదలు పెట్టండి

మొదటి రోజు పూజా స్థానాన్ని శుభ్రపరచి, ఇంటి ఆచారం ప్రకారం దేవి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి.

ఆ తర్వాత కలశాన్ని కూడా ప్రతిష్ఠించి పూజ మొదలుపెట్టండి. అయితే, మొదటి రోజు కలశాన్ని ప్రతిష్ఠించాక మళ్లీ ప్రతిరోజూ కొత్తగా పెట్టక్కర్లేదు.

ఆ తర్వాత దీపారాధన చేసి, దేవి నామాన్ని స్మరించుకుని, పూజా సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మవారికి భక్తితో దీప, ధూప, నైవేద్యాలను సమర్పించండి. పుష్పం, గంధం మొదలైన వాటిని యథావిధిగా సమర్పించండి.

ప్రతిరోజూ ఒకే నిర్దిష్ట రంగు వస్త్రాన్నే తప్పనిసరిగా ధరించాలని సాధారణంగా ఎవరూ చెప్పలేదు. కాబట్టి, మీకు తోచినట్లుగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించవచ్చు.

దేవీ స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను చూడవచ్చు. అలాగే, చివరిగా హారతి ఇచ్చి, నమస్కారం చేసి, క్షమాప్రార్థనతో పూజను ముగించండి.

తొమ్మిది రూపాలను తొమ్మిది రోజులు పూజించాలి

మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిని పూజించాలి.

అమ్మవారికి ఎర్రటి పూలు, తెల్లటి పూలు, తెల్లని స్వీట్లు సమర్పించండి. “ఓం శ్రీ శైలిపుత్రే నమః” అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అమ్మవారికి పాలు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

అలాగే, అమ్మవారికి కుంకుమ, చందనం, పసుపు, అక్షింతలు, తమలపాకులతో పాటుగా అలంకరణ వస్తువులను కూడా సమర్పించడం మంచిది.

నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తొమ్మిది రోజుల పాటు భక్తులు ఉపవాసం ఉంటారు. తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More