Neptune Retrograde: వరుణ గ్రహ తిరోగమనం.. 159 రోజుల పాటు ఈ 4 రాశుల వారికి ఇక అదృష్టమే!

గ్రహ గమనంలో వచ్చే మార్పులు మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వరుణ గ్రహ తిరోగమనం మరోసారి నిరూపించనుంది. డిసెంబర్ 13 వరకు ఈ నాలుగు రాశుల వారి ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మారనున్నాయి.

Published on: Jun 18, 2026, 12:30:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభ ఫలితాలు కలిగితే, మరికొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో వరుణ గ్రహం రహస్యాలు, ఆధ్యాత్మికత, అంతర్‌జ్ఞానం వంటి అంశాలకు కారకుడు. ఈ ఏడాది వరుణ గ్రహం 159 రోజుల పాటు తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఈ ప్రభావం 12 రాశుల వారిపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందితే, మరికొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Neptune Retrograde: వరుణ గ్రహ తిరోగమనం.. ఈ నాలుగు రాశుల వారికి ఇక అదృష్టమే! (pinterest)
Neptune Retrograde: వరుణ గ్రహ తిరోగమనం.. ఈ నాలుగు రాశుల వారికి ఇక అదృష్టమే! (pinterest)

మంగళవారం సాయంత్రం 4:22 గంటలకు వరుణ గ్రహం తిరోగమనంలోకి ప్రవేశించి, డిసెంబర్ 13 వరకు అదే స్థితిలో ఉంటుంది. ఈ వక్రగతి కారణంగా నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగబోతున్నాయి. మరి ఈ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఈ సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి? ఏ రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుణ గ్రహం తిరోగమనం.. ఈ రాశుల వారికి భారీ లాభాలు

1.మేష రాశి

మేష రాశి వారికి వరుణ తిరోగమనం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికపరంగా విజయాలను సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లాభాలను పొందుతారు. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి.

2.వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి వరుణ గ్రహ వక్రగతి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. భూమి లేదా స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ముఖ్యమైన విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాత అప్పులు తీరిపోతాయి.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి వరుణ తిరోగమనం అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. శుభకార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ రాశి వారి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఉద్యోగంలో పురోగతి అవకాశాలు లభిస్తాయి.

4.మీన రాశి

ఈ రాశి వారికి వరుణ గ్రహ వక్రగతి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More