New year Auspicious yogas: అత్యంత అరుదైనది.. 2026 ఆరు శుభ యోగాలతో ప్రారంభమవుతుంది, మూడు రాశులకు విపరీతమైన డబ్బు!

న్యూ ఇయర్ మొదటి రోజు పూజకు ఆదిత్య యోగం, శుక్ర యోగం ఏర్పడడం విశేషం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మకర రాశిలో సంయోగం చెందడంతో ఈ రాజయోగాలు ఏర్పడతాయి. మకర రాశికి అధిపతి అయిన శని రాశిలో ఈ యోగాలు ఏర్పడడం జరుగుతుంది. నాలుగు గ్రహాలు సంయోగం చెందినప్పుడు చాతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది.

Published on: Dec 16, 2025, 13:30:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి శుభ యోగాలను ఎదుర్కొంటే, ఒక్కోసారి అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

New year Auspicious yogas: అత్యంత అరుదైనది.. 2026 ఆరు శుభ యోగాలతో ప్రారంభమవుతుంది (pinterest)
New year Auspicious yogas: అత్యంత అరుదైనది.. 2026 ఆరు శుభ యోగాలతో ప్రారంభమవుతుంది (pinterest)

న్యూ ఇయర్ నాడు శుభ యోగాలు

జనవరి ఒకటిన ప్రదోష వ్రతం వచ్చింది. అలాగే ఆరోజు రోహిణి నక్షత్రం, రవి యోగం, శివవాసయోగం ఏర్పడతాయి. అలాగే న్యూ ఇయర్ మొదటి రోజు పూజకు ఆదిత్య యోగం, శుక్ర యోగం ఏర్పడడం విశేషం. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మకర రాశిలో సంయోగం చెందడంతో ఈ రాజయోగాలు ఏర్పడతాయి. మకర రాశికి అధిపతి అయిన శని రాశిలో ఈ యోగాలు ఏర్పడడం జరుగుతుంది.

2026 సూర్యుని సంవత్సరం. శని, సూర్యుడు రెండూ కూడా శత్రు గ్రహాలు. అలాగే నాలుగు గ్రహాలు సంయోగం చెందినప్పుడు మకర రాశిలో చాతుర్గ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో ఆనందం, సక్సెస్ ఇలా చాలా చూడొచ్చు. మరి 2026 మొదటి రోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూ ఇయర్ నాడు ఈ రాశుల వారికి పండగే.. విపరీతమైన అదృష్టం, ఆనందం.

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. గోల్డెన్ డేస్ మొదలవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కెరియర్లో మంచి మార్పులను చూస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది మంచి సమయం. అలాగే ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా పూర్తవుతాయి.

2.తులా రాశి:

తులా రాశి వారికి కూడా ఈరోజు బాగా కలిసి వస్తుంది. ఈ అద్భుతమైన యోగాలతో కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగుంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ నాడు ఈ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అందరూ మీకు గౌరవం ఇస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.

3.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువ లాభాలను పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ ఆనందం పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More