కుజ, శని దోషాలతో పాటు ఈ దోషాలను తొలగించే శక్తివంతంతమైన నిమ్మకాయ దీపం, ఇలా పెడితే ఎంతో మంచిది!
నిమ్మకాయ దీపంతో దోషాలు తొలగిపోతాయి. కుజ దోషం, శని, కాలసర్ప దోషాలతో బాధ పడుతున్నవారు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం మంచిది. ఈ నిమ్మకాయ దీపాన్ని ఎందుకు వెలిగించాలి, ఎలాంటి దోషాలు తొలగిపోతాయి? ఏ విధంగా ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి వంటి వివరాలను తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వాస్తు ప్రకారం కూడా పరిహారాలను పాటించడం, ప్రతికూల శక్తి కలగకుండా సానుకూల శక్తి కలిగేలా జాగ్రత్తలు తీసుకోవడం ఇలా ఎవరికీ తోచిన పద్ధతులను వారు పాటిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరూ రోజూ ఇంట్లో దీపం వెలిగిస్తారు.

దీపారాధన
ఇంట్లో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, ఆనందంగా ఉండొచ్చని, ప్రతికూల శక్తి మాయమైపోతుందని భావిస్తారు. సాధారణంగా దీపాన్ని వెలిగించేటప్పుడు నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఇలా ఎవరికి నచ్చిన నూనెను వారు కుందులో వేసి రెండు వత్తులు వేసి వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించిన తర్వాత కొద్దిగా కుంకుమ, పసుపుతో అలంకరించి అక్షింతలు, పుష్పం వేసి నమస్కారం చేసుకుంటారు.
ఇది ఇలా ఉంటే చాలామంది కొన్ని సమస్యలతో బాధ పడుతుంటారు. అలాంటి వారు నిమ్మకాయతో దీపాన్ని వెలిగించడం మంచిది. అయితే, ఈ నిమ్మకాయ దీపాన్ని ఎందుకు వెలిగించాలి, ఎలాంటి దోషాలు తొలగిపోతాయి? ఏ విధంగా ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి వంటి వివరాలను తెలుసుకుందాం.
నిమ్మకాయతో దీపారాధన
నిమ్మకాయ దీపంతో దోషాలు తొలగిపోతాయి. కుజ దోషం, శని, కాలసర్ప దోషాలతో బాధ పడుతున్నవారు, వివాహ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం మంచిది. గ్రామదేవతల ఆలయాల్లో రాహుకాలంలో మహిళలు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. శుభం కలుగుతుంది.
ఇలా గ్రామ దేవతల ఆలయాల్లో రాహుకాలంలో మహిళలు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కుటుంబంలో శాంతి కూడా ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను పొందడానికి వీలవుతుంది.
నిమ్మకాయ దీపం ఏ విధంగా పెడితే మంచిది?
- ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోవాలి. దానిని రెండు భాగాలుగా కోసుకోవాలి.
- ఆ తర్వాత రసాన్ని తీసేసి తొక్కను వెనక్కి తిప్పి పెట్టాలి. అలా చేసినట్లయితే అది ఒక దీపం మాదిరిగా తయారవుతుంది.
- ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి లేదా నువ్వుల నూనె వేయాలి.
- పత్తితో చేసిన వత్తులను వేసి, పసుపు, కుంకుమలతో ఆ దీపాన్ని అలంకరించి ఆ తర్వాత వెలిగించండి.
- ఈ దీపాలను సాధారణంగా రాహుకాలంలో దుర్గాదేవి లేదా గ్రామదేవతల ఆలయాల్లో వెలిగించడం ఎంతో మంచిది. దీపాన్ని నేరుగా నేలపై పెట్టకండి.
- దాని కింద ప్లేటు లేదా ఆకు వేసి వెలిగించండి. ఇలా చేసినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. పైన చెప్పిన లాభాలు అన్నీ కూడా ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


