హిందూ సంప్రదాయంలో ప్రతి రోజుకు, ప్రతి వారాన్ని ప్రారంభించే తీరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవి పూజకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజూ గ్రహాలు మరియు నక్షత్రాల గమనంలో వచ్చే మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది.

కొందరికి కొత్త బాధ్యతలు ఎదురుకాగా, మరికొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు అందుతాయి. మరి మీ రాశి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి
కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. చిన్న తోబుట్టువులు కెరీర్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది.
చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే పెరుగుతున్న ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ముందుస్తుగా సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి, క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
వృషభ రాశి
మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మారుతుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది.
స్నేహితుల సలహాతో ధనలాభానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. రొమాంటిక్ లైఫ్ అద్భుతంగా సాగుతుంది. భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఆయిలీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
మిథున రాశి
ఆర్థికంగా మంచి సుస్థిరత లభిస్తుంది. కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు లభించినప్పటికీ, కొన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది.
{{/usCountry}}ఆర్థికంగా మంచి సుస్థిరత లభిస్తుంది. కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యక్తిగత ఎదుగుదలకు అనేక అవకాశాలు లభించినప్పటికీ, కొన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంది.
{{/usCountry}}ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉండి, మేనేజ్మెంట్లో మంచి పేరు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడి, చాలాకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. మీ కుటుంబ సభ్యులకు మీ ప్రేమికుడిని పరిచయం చేసే అవకాశం ఉంది.
కొత్త సాహస కార్యకలాపాల్లో పాల్గొని జీవితాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది. లవ్ లైఫ్‌లో ఆనందకర వాతావరణం ఉంటుంది.
సింహ రాశి
ఆర్థిక విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా కెరీర్ గ్రోత్ పెరుగుతుంది.
కన్య రాశి
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విపరీతమైన ఖర్చుల కారణంగా మనసు అశాంతిగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. పని నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ స్ట్రెస్‌ను ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో సంతోషంగా గడపండి. రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
తులా రాశి
జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. కెరీర్లో కొత్త మైలురాళ్లను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెట్టడంతో పాటు కొత్త ఫైనాన్షియల్ ప్లాన్ రూపొందించుకోండి.
అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. సింగిల్స్‌గా ఉన్నవారి జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో మీ నైపుణ్యాలు, సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే సూచనలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఇంటికి అతిథుల రాకతో కోలాహలంగా ఉంటుంది. ధనపరమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. మనసులో చిన్నపాటి ఆందోళన ఉన్నప్పటికీ, భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే బంధం బలపడుతుంది.
ధనుస్సు రాశి
ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి, ధన ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. మహిళలు గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.
ఆన్లైన్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక నిర్ణయాలు సరైన ఫలితాలనిస్తాయి. అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మకుండా రీసెర్చ్ చేసిన తర్వాతే పెట్టుబడులు పెట్టండి.
మకర రాశి
సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ దైనందిన దినచర్య నుంచి కాస్త విరామం తీసుకుని సెల్ఫ్‌కేర్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
కాపీ రైటర్లు, ఎడిటర్లు మరియు ఉద్యోగులకు కెరీర్లో అద్భుతమైన వృద్ధి అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో వేడుకలు జరిగే సూచనలున్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కుంభ రాశి
ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, లేదంటే నష్టం వాటిల్లవచ్చు. ఆఫీసులో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు బయటకు వెళ్తారు.
ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డబ్బును స్మార్ట్‌గా మేనేజ్ చేయడం నేర్చుకోండి. అనవసర ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైళిని అలవర్చుకోండి.
మీన రాశి
సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు మంచి ఫలితాలు దక్కుతాయి. విద్యారంగంలో ఉన్నవారికి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబంతో కలిసి వెకేషన్‌కు ప్లాన్ చేసుకుంటారు.
తోబుట్టువులు లేదా ఆప్తమిత్రులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. సింగిల్స్‌కు ఆసక్తికరమైన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆఫీసు పాలిటిక్స్‌కు దూరంగా ఉండండి.