మీ భార్య లేదా ప్రేయసి ఈ తేదీల్లో పుట్టారా? అయితే మీరు ప్రపంచంలోనే లక్కీ పర్సన్!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో జన్మించిన మహిళలు తమ భాగస్వామి పట్ల ప్రాణమిచ్చేంత ప్రేమను కలిగి ఉంటారట. కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా నీడలా వెన్నంటే ఉండే ఆ ప్రత్యేక సంఖ్య కలిగిన వారి వివరాలు మరియు మీ నంబర్‌ను ఎలా లెక్కించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే, ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కొన్ని ప్రత్యేక సంఖ్యలు ఉన్నాయి. ఈ లైఫ్ పాత్ నెంబర్ కలిగిన మహిళలు తమ భాగస్వాముల పట్ల ఎంతో ప్రేమ, ఆసక్తి చూపిస్తారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా భాగస్వామికి అండగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రేమికుడైనా, భర్త అయినా సరే తమ భాగస్వామిని అపారంగా ప్రేమిస్తారు.
లైఫ్ పాత్ నెంబర్, డెస్టిని నెంబర్‌లను ఎలా లెక్కించాలి?
డెస్టిని నెంబర్‌ను తేదీ, నెల, సంవత్సరం సంఖ్యలను కలిపి లెక్కిస్తారు. ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి లైఫ్ పాత్ నెంబర్ 2 అవుతుంది.
లైఫ్ పాత్ నెంబర్‌ను ఇలా లెక్కించాలి
ఎవరైనా మార్చి 29, 1999న పుట్టినట్లయితే:
తేదీ 29 2+9 = 11 1+1 = 2
నెల 3
సంవత్సరం 1999.. 1+9+9+9 = 28.. 2+8 = 10.. 1+0 = 1
ఇప్పుడు మొత్తం అన్నీ కలిపితే:
2 + 3 + 1 = 6
అంటే, వారి డెస్టిని నెంబర్ 6 అవుతుంది.
లైఫ్ పాత్ నెంబర్ 2
లైఫ్ పాత్ నెంబర్ 2 ఉన్న మహిళలు చాలా నమ్మకస్తులు. లైఫ్ పాత్ నెంబర్ 2 లేదా డెస్టిని నెంబర్ 2 కలిగిన మహిళలు ఎప్పుడూ విశ్వాసంగా ఉంటారు. కష్ట సమయంలో కూడా భర్తను ఏ మాత్రం వదిలిపెట్టరు. సుఖ దుఃఖాల్లో తోడుగా ఉంటారు. ఈ సంఖ్యకు చెందిన వారు ఉత్తమ భాగస్వాములు అని చెప్పచ్చు.
చంద్రుడి ప్రభావం
సంఖ్య 2కు అధిపతి చంద్రుడు. చంద్రుడి ప్రభావం ఉండడంతో ఈ మహిళలు భావోద్వేగపరులు, సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. భాగస్వామిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. మోసాన్ని కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు సహించలేరు. అందువల్ల ప్రేమలో సులభంగా మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితులు వారి మనసుకు ఎంతో బాధ కలిగిస్తాయి.
అనుకూలమైన సంఖ్యలు
లైఫ్ పాత్ లేదా డెస్టిని నెంబర్ 2 కలిగిన మహిళలకు 1, 3, 5, 6, 7 సంఖ్యల లైఫ్ పాత్ నెంబర్ కలిగిన వారు మంచి భాగస్వాములుగా ఉంటారు. వీరికి వారు చాలా అనుకూలంగా ఉంటారు. సంతోషకరమైన జీవితాన్ని అందిస్తారు. ఎప్పుడైనా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు లైఫ్ పాత్, డెస్టిని నెంబర్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


