న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీల ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ఈ సంఖ్య ద్వారా వ్యక్తి జీవన విధానం, అలవాట్లు, ప్రేమ విషయాలు వంటివి కూడా తెలుసుకోవచ్చు.

ప్రతి రాడిక్స్ సంఖ్యకు ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం వ్యక్తి జీవితం, సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాడిక్స్ సంఖ్య కలిగిన వ్యక్తులు సంబంధాలను చూసే విధానం, వాటిని కొనసాగించే తీరు భిన్నంగా ఉంటాయి. ఈరోజు రాడిక్స్ సంఖ్యలు 7, 8కి సంబంధించిన వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం.
రాడిక్స్ సంఖ్య 7
ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. ఈ సంఖ్యకు కేతు గ్రహంతో సంబంధం ఉంటుంది. ఈ వ్యక్తులు సాధారణంగా ప్రశాంతంగా, గంభీరంగా ఉంటారు. ఏ విషయం అయినా లోతుగా అర్థం చేసుకుంటారు. వెంటనే ఒక నిర్ణయానికి రారు. ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించే తత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక, రహస్యమైన విషయాలపై ఆసక్తిని చూపిస్తారు. ప్రశాంతమైన వాతావరణాన్ని, కొంత సమయాన్ని ఒంటరిగా గడపడాన్ని ఈ తేదీల్లో పుట్టిన వారు ఇష్టపడతారు. అలాగే వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
ఇక రాడిక్స్ సంఖ్య 7 వారి ప్రేమ విషయానికి వస్తే, వారి భావాలను అంత ఓపెన్‌గా ఇతరులతో పంచుకోరు. ఒకసారి ఎవరినైనా ఇష్టపడితే నిజాయితీగా ఆ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తారు. వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ ఈ తేదీల్లో పుట్టిన వారికి చాలా ముఖ్యమైనవి. అలాగే అతిగా ఆంక్షలు విధించడం లేదా ప్రతి విషయంలో నియంత్రించడం ఈ తేదీల్లో పుట్టిన వారికి నచ్చదు.
రాడిక్స్ సంఖ్య 8
ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి శని గ్రహంతో సంబంధం ఉంటుంది. క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే వారి లక్ష్యాల విషయంలో గంభీరంగా ఉంటారు. పట్టుదలతో కష్ట పడితేనే విజయాన్ని సాధించవచ్చని ఈ తేదీల్లో పుట్టిన వారు నమ్ముతారు. కెరీర్, ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాధ్యతలను ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు.
{{/usCountry}}ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి శని గ్రహంతో సంబంధం ఉంటుంది. క్రమశిక్షణ, కష్టపడి పని చేయడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే వారి లక్ష్యాల విషయంలో గంభీరంగా ఉంటారు. పట్టుదలతో కష్ట పడితేనే విజయాన్ని సాధించవచ్చని ఈ తేదీల్లో పుట్టిన వారు నమ్ముతారు. కెరీర్, ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాధ్యతలను ఎంతో సీరియస్‌గా తీసుకుంటారు.
{{/usCountry}}ఇక వారి ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం, నిబద్ధతకు ప్రాధాన్యత ఇస్తారు. మాటల ద్వారా కాదు, పనులు, చర్యల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. భాగస్వామికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా రొమాంటిక్‌గా ఉంటారు. బలమైన నమ్మకం, పరస్పర అవగాహనతో కూడిన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కాస్త సమయాన్ని తీసుకుంటారు. కానీ ఒకసారి ప్రేమలో పడ్డాక మాత్రం ఎల్లప్పుడూ నిజాయితీతో వారి జీవిత భాగస్వామిని ఇష్టపడతారు.