Numerology Reveals: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వెరీ స్మార్ట్.. కానీ అంత ఈజీగా వారి భావాలను బయట పెట్టరు!
న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలియజేయవచ్చు. కొన్ని సంఖ్యల వారు చాలా ప్రత్యేకమైన వారు. నిజానికి ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలియజేయవచ్చు. కొన్ని సంఖ్యల వారు చాలా ప్రత్యేకమైన వారు. నిజానికి ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉంటారు. అయితే వారి భావాలను అంత సులువుగా ఇతరులతో ఎక్స్‌ప్రెస్ చేయరు. మరి స్మార్ట్‌గా ఉండే అమ్మాయిలు ఎవరు? ఈ సంఖ్యలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా స్మార్ట్, కానీ వారి భావాలను అంత సులువుగా బయటకు చెప్పరు
రాడిక్స్ నెంబర్ 4
ఏదైనా నెలలో 4, 13, 22 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నంబర్ 4 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇతరులతో పోల్చుకుంటే కొంచెం భిన్నంగా ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు త్వరగా ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలరు. ఏ సమస్యని కూడా అంత తేలికగా వదిలిపెట్టరు. సులువుగానే కష్టాలు వచ్చినా కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తారు.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్
రాడిక్స్ నంబర్ 4 వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారిపై వారికి నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ. అంత సులువుగా ఇతరుల ముందు తల వంచరు. ఎప్పుడూ ఓటమిని ఈజీగా ఒప్పుకోరు.
బాగా మొండివారు
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మొండిగా ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారి మొండితనం వలన త్వరగా సక్సెస్‌ని అందుకుంటారు. కష్టమైనా కూడా వారు అనుకున్నది సాధిస్తారు. పట్టు పట్టారంటే వదిలిపెట్టరు. వారేంటో చూపిస్తారు.
ప్రయతిస్తూ వుంటారు
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారు ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ విజయాలను అందుకోవడానికి కృషి చేస్తూనే ఉంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ కూడా భయపడడం, వెనక్కి వెళ్లడం చెయ్యరు. ధైర్యంగా ముందుకెళ్తారు. అదే వారిని సక్సెస్ అయ్యేలా చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


