...
...
Next Story

Numerology : టీవీకే విజయ్ విక్టరీ వెనక రాహువు పాత్ర.. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారా?

Numerology : తమిళనాడు సీఎం పీఠం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. టీవీకే విజయ్ విజయం వెనక రాహువు పాత్ర ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారా? అని చాలా మంది జాతకాలు చెబుతున్నారు.

Published on: May 7, 2026, 07:24:53 IST
Advertisement

సెలబ్రెటీలు ఎక్కువగా న్యూమరాలజీని కూడా నమ్ముతుంటారు. ఇప్పుడు దళపతి విజయ్ విషయంలోనూ సంఖ్యాశాస్త్రాన్ని అనేక మంది పరిశీలిస్తున్నారు. ఒక మనిషి విజయంపై గ్రహాల కదలికలు కూడా ప్రభావం చూపిస్తాయని చెబుతుంటారు. దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్లడంతో గ్రహాల ముఖ్యమైన పాత్ర కూడా ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

విజయ్ (PTI)
విజయ్ (PTI)

టీవీకే విజయ్ గెలుపు వెనక రాహువు, 4వ సంఖ్య పోషించిన కీలక పాత్ర కూడా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న విజయ్ రాజకీయ రంగంలోనూ తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే జాతకంలో కొన్ని గ్రహాలు, నక్షత్రాలు బలంగా ఉండాలి.

కేవలం రెండేళ్ల క్రితం తమిళనాడు రాజకీయాల్లోకి టీవీకే పార్టీ వచ్చింది. మెుదటి ఎలక్షన్‌లో విజయ్ దళపతి ముఖ్యమంత్రి పదవి వద్దకు చేరుకున్నారు. జీవితంలో ఆకస్మిక మార్పులకు కారణమైన రాహువు ప్రభావం విజయ్ భారీ విజయం వెనుక ఉంది.

విజయ్ దళపతి 1974, జూన్ 22న జన్మించారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఆయన రాడిక్స్ సంఖ్య 22, అంటే 2 + 2 = 4. సంఖ్యాశాస్త్రంలో 4 అనే రాడిక్స్ సంఖ్యకు రాహువు అధిపతి. జ్యోతిష్యం ప్రకారం, రాజకీయాలలో రాహువు అనుకూల స్థితిలో ఉండటం ఒక వ్యక్తిని రాజకీయ రాజుగా చేస్తుంది.

4వ సంఖ్య గల వ్యక్తులు ఆకస్మిక మార్పులకు, వినూత్న ఆలోచనలకు ప్రసిద్ధి చెందారు. మరియు ఇందులో రాహువు కీలక పాత్ర పోషిస్తాడు. రాహువు శుభప్రభావం వ్యక్తులను రాజకీయాలలో గొప్ప ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. ఏ నెలలోనైనా 4వ, 13వ, 22వ, లేదా 31వ తేదీన జన్మించిన వ్యక్తికి రాడిక్స్ సంఖ్య 4 ఉంటుంది. దీని అధిపతి రాహువు.

విజయ్ దళపతి జాతకంలోని అష్టకవర్గం ప్రకారం , పదో ఇల్లు (అధికారం, వృత్తికి సంబంధించిన ఇల్లు) 30 కంటే ఎక్కువ స్కోరును కలిగి ఉంది. ఇది చాలా బలమైన స్థానంగా చెబుతుంటారు. జ్యోతిష్య సూత్రాల ప్రకారం, పదో ఇల్లు ఇంత బలంగా ఉండి, గురు గ్రహం అనుగ్రహంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కచ్చితంగా ఉన్నత అధికారాన్ని, అగ్రస్థానాలను చేరుకుంటాడు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe