...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నెంబర్ వన్!

న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ప్రతి సంఖ్యకీ తగిన ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో నెంబర్ వన్. తెలివితేటలు కూడా ఎక్కువే.

Published on: Jan 20, 2026, 10:00:39 IST
Advertisement

న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ప్రతి సంఖ్యకీ తగిన ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు నిర్ణయాలు తీసుకోవడంలో నెంబర్ వన్ (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన అమ్మయిలు నిర్ణయాలు తీసుకోవడంలో నెంబర్ వన్ (pinterest)

కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో నెంబర్ వన్. తెలివితేటలు కూడా ఎక్కువే. మనం పుట్టిన తేది సంఖ్య మాత్రమే కాదు, వ్యక్తి తాలూకా వ్యక్తిత్వానికి ప్రతిబింబం. పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వం, కెరీర్, ఆర్థిక పరిస్థితి గురించి కూడా అంచనా వేయొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైన వారు. ఎందులోనూ ఇతరులతో సరితూగరు.

రాడిక్స్ సంఖ్య ఎనిమిది:

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా ఇతరులపై ఆధారపడకుండా ఉంటారు.

శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు:

ఈ తేదీల్లో పుట్టిన వారిపై శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. శని న్యాయ దేవుడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలను ఇస్తాడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా కష్ట పడుతుంటారు. ఎప్పుడూ కూడా మంచిగా ఉంటారు. జీవితంలో సక్సెస్‌ను అందుకుంటారు. కానీ ఎక్కువ కష్టపడితే కానీ ఈజీగా సక్సెస్‌ను అందుకోలేరు. వారు పడే కష్టంతోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా:

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బాగా తెలివైన వారు. ఆర్థిక పరంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు. ఎప్పుడూ కూడా కుటుంబానికి ఒక మూలస్తంభంలా నిలబడతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe