ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల మనసు వెన్న, ఇతరుల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు!

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలైతే ఎవరికోసమైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనసు ఎంతో విశాలం. ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానీ ఎప్పుడూ సహాయం చేయడాన్ని వారి బాధ్యతగా భావిస్తారు. మరి వీరిలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

Published on: Jan 19, 2026, 08:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారిలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల మనసు వెన్న, ఇతరుల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల మనసు వెన్న, ఇతరుల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు (pinterest)

తేదీల్లో పుట్టిన అమ్మాయిలైతే ఎవరికోసమైనా ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరి మనసు ఎంతో విశాలం. ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయరు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కానీ ఎప్పుడూ సహాయం చేయడాన్ని వారి బాధ్యతగా భావిస్తారు. మరి వీరిలో మీరు కూడా ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ సంఖ్య ఒకటి:

ఏదైనా నెలలో 1, 10, 19 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రాజు. అలాగే ఈ సంఖ్యకు కూడా అధిపతి. రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. వీరికి నాయకత్వం వహించడానికి ఇష్టం ఉంటుంది.

మొండితనం:

రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు చాలా మొండిగా ఉంటారు. అలాగే నాయకత్వం వహించడానికి కూడా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి బాధ్యతగా ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది. వారి నిర్ణయాలు వారు సొంతంగా తీసుకోగలరు. ఇతరులకి ఒత్తిడి కల్పించకూడదని భావిస్తారు. అలాగే స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. వారి జీవితం, వారి రూల్స్ అన్న విధంగా వ్యవహరిస్తారు.

విశాలమైన హృదయం:

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు విశాలమైన హృదయం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. మరో ఆలోచన లేకుండా సహాయం చేస్తారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. అది వారి బాధ్యతగా భావిస్తారు.

మానసికంగా ధృడంగా:

రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన అమ్మాయిలు మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు వారిని అందరూ వదిలేసినట్లుగా అనిపిస్తుంది. అదే వారికి కాస్త మానసిక ఇబ్బందిని కలిగిస్తుంది.

వీరి బలాలు:

రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన వారికి ఏ మాత్రం భయం ఉండదు. అదే వారిలో ఉన్న అతి పెద్ద బలం. ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సులువుగా వెతకగలరు. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే భయపడరు. కెరియర్‌లో కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More