Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కాన్ఫిడెన్స్ ఎక్కువ.. అనుకున్నది సాధిస్తారు, ఎవరూ ఆపలేరు!

న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఒక్కో సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

Published on: Dec 2, 2025, 10:00:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉన్నాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. ఒక్కో సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక మనిషితో పోల్చుకుంటే మరొకరికి వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కాన్ఫిడెన్స్ ఎక్కువ (pinterest)
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కాన్ఫిడెన్స్ ఎక్కువ (pinterest)

అభిరుచులు కూడా ఒకరితో పోల్చుకుంటే మరొకరివి వేరుగా ఉంటాయి. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య:

రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందినవారు ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వీరికి సామర్థ్యం కూడా ఎక్కువ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. రాడిక్స్ నెంబర్ ఒకటికి అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన వారు ఎప్పుడూ కూడా అనుకున్న వాటిని పూర్తి చేస్తారు, సక్సెస్‌ను అందుకుంటారు. ఎలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించడానికి అయినా ఏ మాత్రం భయపడరు, వెనక్కి తగ్గరు.

రాడిక్స్ నెంబర్ 1:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. ఈ రాడిక్స్ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు.

కష్టపడి పనిచేస్తారు:

రాడిక్స్ నెంబర్ ఒకటికి చెందిన అమ్మాయిలు ఎప్పుడూ కష్టపడి పని చేస్తారు. వారు అనుకున్నది పూర్తి చేసే వరకు కష్టపడుతూనే ఉంటారు. మధ్యలో వదిలిపెట్టడం వారికి నచ్చదు. ఏ రంగంలో అయినా ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు బాగా కలిసి వస్తుంది. కలలను కూడా కొంచెం సమయంలోనే నిజం చేసుకుంటారు.

నిజాయితీగా ఉంటారు

ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలు నిజాయితీగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. అలాగే ఎవరినైనా ఇష్టపడితే వారి ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. నిజాయితీగా ఉంటారు, గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు, ఇతరులను కూడా అర్థం చేసుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ. అయితే అప్పుడప్పుడు కాస్త కోపం వస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రేమ, గౌరవం, నమ్మకాన్ని పొందినట్లయితే కచ్చితంగా ఇష్టపడిన వ్యక్తితో సంతోషంగా ఉంటారు. మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోవడం వంటివి వీరికి నచ్చదు.

నాయకత్వ లక్షణాలు ఎక్కువ:

రాడిక్స్ నెంబర్ ఒకటికి చెందిన అమ్మాయిలకు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా చాలెంజ్‌ను ఎదుర్కోవడానికి భయపడరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. కలలను నిజం చేసుకుంటారు. విజయాన్ని చేరుకునే వరకు నిద్రపోరు. కష్టపడి పని చేస్తారు. అయితే కొంచెం మొండిగా వుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More