ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు దుర్గా దేవిలా ధైర్యవంతులు.. ప్రేమించిన వారి కోసం కూడా ఏమైనా చేస్తారు!

న్యూమరాలజీ ప్రకారం, ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని సంఖ్యలు వారు చాలా స్పెషల్; వారిలో చాలా అరుదైన గుణాలు ఉంటాయి. ఈరోజు అలాంటి సంఖ్యల గురించి తెలుసుకుందాం.

Published on: Mar 20, 2026, 17:01:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా ఎన్నో విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం, ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో తేదీల్లో పుట్టిన వారి స్వభావం, తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని సంఖ్యలు వారు చాలా స్పెషల్; వారిలో చాలా అరుదైన గుణాలు ఉంటాయి. ఈరోజు అలాంటి సంఖ్యల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దుర్గా దేవిలా ధైర్యవంతులు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దుర్గా దేవిలా ధైర్యవంతులు (pinterest)

అమ్మాయికి ధైర్యం ఎక్కువగా ఉండాలి. చాలా మంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు, కానీ ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు. వీరికి భయం ఉండదు. దుర్గాదేవిలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు కూడా చాలా శక్తివంతమైన వారు. పైగా, ప్రేమ కోసం దేనికైనా వెనుకాడరు. మరి ఈ సంఖ్యలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా ధైర్యవంతులు.. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు

రాడిక్స్ సంఖ్య 3:

ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్త కోసం, ప్రేమించిన వారి కోసం ఏమైనా చేస్తారు. కాళీమాతలా శక్తితో, ధైర్యంగా ముందుకు వెళ్తారు. వీరికి భయం ఉండదు. పైగా, ఈ తేదీల్లో పుట్టిన వారు అన్యాయం జరిగితే ఊరుకోరు. దానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించరు.

రాడిక్స్ సంఖ్య 1:

ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా కమాండింగ్ పవర్‌తో ఉంటారు. ఎప్పుడూ కూడా ప్రేమించిన వారిని గౌరవిస్తారు. ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వరు. ప్రేమించిన వారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అంతే కానీ, భయంతో వెనుకడుగు వేయరు.

రాడిక్స్ సంఖ్య 8:

ఏదైనా నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ కూడా తప్పు నిర్ణయాలు తీసుకోరు. అలాగే, అన్యాయాన్ని ఏ మాత్రం సహించరు. ఎవరైనా తప్పు చేస్తే రివెంజ్ తీర్చుకునే వరకు వెళ్తారు. భర్త తప్పు చేసినా కూడా అంతే. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు.

రాడిక్స్ సంఖ్య 9:

ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యంగా ఉంటారు. దేనికీ భయపడరు. ఎలాంటి ఛాలెంజ్‌లను స్వీకరించడానికి అయినా ఏ మాత్రం వెనుకాడరు. భర్త బాధలో ఉంటే తోడుగా ఉంటారు. భర్త సమస్యల్లో ఉంటే సాయం చేస్తారు. భర్తను చండీమాతలాగా రక్షిస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More