న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను సులువుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో మనం చూసినట్లయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఏ అమ్మాయిలకు అదృష్టం ఎప్పుడూ ఉంటుంది? కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి అందం, సంపద ఉంటాయి. ఎల్లప్పుడూ వారు సంపదతో సంతోషంగా ఉంటారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు? మరి మీరు వీరిలో ఒకరేమో చూసుకోండి.
రాడిక్ సంఖ్య 6:

ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్ సంఖ్య 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. పైగా ఆకర్షణగా కూడా కనిపిస్తారు.
శుక్రుడు అధిపతి:
రాడిక్ సంఖ్య 6 కు ఆరోగ్యాధిపతి శుక్రుడు. శుక్రుడి అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అందం, ప్రేమ, డబ్బు, విలాసాలు వంటి వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడి అనుగ్రహంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి కూడా వీరి వెంటే ఉంటుంది. అలాగే విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు.
అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు
రాడిక్ సంఖ్య 6 కి చెందిన వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే వీరి మనసు కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందరితో కలిసిపోతారు. సమాజంలో గౌరవ, మర్యాదలను కూడా పొందుతారు. వీరి వస్త్రధారణ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.
తండ్రికి, భర్తకి లక్ష్మీదేవులు:
మీరు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. పెళ్లికి ముందు తండ్రికి అదృష్టాన్ని, సంపదను తీసుకు వస్తే, పెళ్లి అయిన తర్వాత భర్తకు అదృష్టం మరియు సంపదను తీసుకు వస్తారు. అత్తమామలకు, భర్తకు అదృష్టాన్ని రెట్టింపు చేస్తారు. వీరి కారణంగా వారి జీవిత భాగస్వామి కెరీర్‌లో, వ్యాపారంలో గొప్ప పురోగతి ఉంటుంది.
ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావు. ఆర్థిక నష్టం వంటివి కూడా చూడరు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కంఫర్ట్‌గా, విలాసవంతంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉండవు ఆనందాలే ఉంటాయి.
{{/usCountry}}ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ డబ్బు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు రావు. ఆర్థిక నష్టం వంటివి కూడా చూడరు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో కంఫర్ట్‌గా, విలాసవంతంగా ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉండవు ఆనందాలే ఉంటాయి.
{{/usCountry}}గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.