ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రతి దాంట్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు!
న్యూమరాలజీ ఆధారంగా మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు ప్రవర్తన, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్లు 1 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ సంఖ్యలను బట్టి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు బాగా అదృష్టవంతులు.
న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్లు 1 నుంచి 9 వరకు ఉంటాయి.

ఈ సంఖ్యలను బట్టి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు బాగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వారు బాగా డబ్బును, పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదిస్తారు. ఈ రోజు ఆ రాడిక్స్ సంఖ్య 1 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.
రాడిక్స్ సంఖ్య 1
రాడిక్స్ సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన వారు సూర్యుడి మాదిరి ప్రకాశవంతంగా వుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, సక్సెస్‌ను అందుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు సంఖ్య ఒకటికి చెందిన వారిలో ఉంటాయి. అలాగే రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎన్నో ముఖ్యమైన లక్షణాలు కూడా వీరిలో ఉంటాయి. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సంతోషంగా ఉంటారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఒక రాజులా జీవిస్తారు.
రాడిక్స్ సంఖ్య ఒకటి, అధిపతి సూర్యుడు
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక సంఖ్య ఒకటి అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడి ప్రభావంతో ఈ సంఖ్యకు చెందిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాన్ఫిడెన్స్‌తో ఉంటారు.
నాయకత్వ లక్షణాలు ఎక్కువ
రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందిన వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడూ వారిపై వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు కూడా వీరిని చూసి ఎక్కువగా ప్రభావితమవుతారు. అలాగే వీరి మాటలను కూడా అందరూ వినడానికి ఇష్టపడతారు. విజయాన్ని అందుకుంటారు.
విజయాన్ని అందుకుంటారు
రాడిక్స్ సంఖ్య ఒకటికి చెందినవారు త్వరగా విజయాన్ని అందుకుంటారు. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. ప్రతి అడుగులో కూడా అదృష్టం వారితో ఉంటుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు, కష్టపడి పని చేస్తారు, బాగా ఆలోచిస్తారు కూడా.
ఇతరులకు ఆదర్శంగా ఉంటారు
సంఖ్య ఒకటికి చెందిన వారు ఎప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే ఈ సంఖ్యకు చెందిన వారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఇతరులు ముందుకు వెళ్లడానికి వీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇతరులు వీరిని అనుసరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు.
అప్పుడప్పుడు మొండిగా ఉంటారు
కొన్నిసార్లు మాత్రం సంఖ్య ఒకటికి చెందిన వారు కాస్త మొండిగా, కోపంగా ఉంటారు. అలాగే ఒక్కోసారి వీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల రిలేషన్‌షిప్‌లు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో సంఖ్య ఒకటికి చెందినవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


