న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, మొత్తం రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. అలాగే ప్రతి సంఖ్యకు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఈ రోజు రాడిక్స్ సంఖ్య 7కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
రాడిక్స్ సంఖ్య 7

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎలాంటి ప్రమాదాన్ని అయినా సరే ముందుగానే అంచనా వేయగల అద్భుతమైన శక్తి వీరికి ఉంటుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు కావడంతో, జీవితం ఎంత కఠినమైన దశలో ఉన్నా కూడా ధైర్యాన్ని కోల్పోరు. ప్రతిక్షణం ధైర్యంతో ముందుకు వెళ్తారు. వారి వ్యక్తిత్వం ఎంతో ప్రభావవంతమైనదిగా ఉంటుంది. వీరి ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
రాడిక్స్ సంఖ్య 7 వారి ప్రత్యేక లక్షణాలు
ధైర్యవంతులు
రాడిక్స్ సంఖ్య 7 వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే కృంగిపోవడం, వెనక్కి వెళ్లిపోవడం వీరికి తెలియదు. సమయాన్ని బట్టి అడుగు ముందుకేస్తారు. మంచి ఆలోచనలతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారి తెలివితేటలు, ధైర్యం ఇతరులను ఈజీగా ఆకట్టుకుంటాయి. జీవితంలో ఏ విధమైన సవాళ్లు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతారు.
కెరీర్, విజయాలు
రాడిక్స్ సంఖ్య 7 వారు పరిశోధన, ఆధ్యాత్మికత, సాంకేతిక రంగాలు, సృజనాత్మక విభాగాల్లో బాగా రాణించగలరు. కేతువు అనుగ్రహంతో వీరికి రహస్యమైన జ్ఞానం లభిస్తుంది. శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు, రచయితలు లేదా గూఢచారులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయగలరు. వ్యాపారంలో ఎక్కువ లాభాలను పొందుతారు. ధైర్యంతో పెద్ద లక్ష్యాలను కూడా సులువుగా సాధిస్తారు. కెరీర్‌లో ఎత్తుపళ్ళాలు ఉన్నప్పటికీ, చివరికి విజయాలను అందుకుంటారు. విజయం ఆలస్యంగా వచ్చినా సరే అది చాలా గొప్పదై ఉంటుంది.
ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
రాడిక్స్ సంఖ్య 7 వారి ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఈ తేదీల్లో పుట్టిన వారు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. వారి వైవాహిక జీవితం స్థిరంగా ఉంటుంది. ధైర్యంగా సంబంధాలను కాపాడుకుంటారు. కేతువు కృపతో వీరికి సంబంధాలు దీర్ఘకాలం నిలిచి సంతోషాన్ని ఇస్తాయి.
ఈ పరిహారాలను పాటించండి
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 7 వారి ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఈ తేదీల్లో పుట్టిన వారు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. వారి వైవాహిక జీవితం స్థిరంగా ఉంటుంది. ధైర్యంగా సంబంధాలను కాపాడుకుంటారు. కేతువు కృపతో వీరికి సంబంధాలు దీర్ఘకాలం నిలిచి సంతోషాన్ని ఇస్తాయి.
ఈ పరిహారాలను పాటించండి
{{/usCountry}}ఆరోగ్యం పరంగా మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శనివారం లేదా మంగళవారం నాడు వినాయకుడిని లేదా కేతువును ఆరాధించడం మంచిది. ఆవనూనెను దానం చేయడం మంచిది. ఓం కేతవే నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆర్థికపరంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో పాటు అనేక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి.