Sign in

ఈ నెలలో పుట్టిన వారిలో ప్రత్యేక శక్తి దాగి ఉంది.. వీరు ఎక్కడుంటే అక్కడ అనందం, డబ్బు!

పుట్టిన నెల భవిష్యత్తులో చాలా విషయాల గురించి చెప్తుంది. ఒక మనిషి పుట్టిన నెల ఆధారంగా వారి ప్రవర్తన, తీరు, బలాలు, బలహీనతలు వంటి విషయాలను చెప్పవచ్చు. జనవరి‌తో కొత్త సంవత్సరం మొదలవుతుంది. అయితే జనవరి నెలలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? మీరు జనవరి నెలలో పుట్టారా? అయితే మీ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

Published on: Jan 3, 2026, 10:00:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే పుట్టిన నెల ఆధారంగా కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది. 2026 జనవరిలోకి అడుగుపెట్టాము. జనవరిలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. ఈ నెలలో పుట్టిన వారు అనేక మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే సక్సెస్‌ను కూడా ఈజీగా అందుకుంటారు.

ఈ నెలలో పుట్టిన వారిలో ప్రత్యేక శక్తి దాగి ఉంది (pinterest)
ఈ నెలలో పుట్టిన వారిలో ప్రత్యేక శక్తి దాగి ఉంది (pinterest)

జనవరి నెలలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు?

పుట్టిన నెల భవిష్యత్తులో చాలా విషయాల గురించి చెప్తుంది. ఒక మనిషి పుట్టిన నెల ఆధారంగా వారి ప్రవర్తన, తీరు, బలాలు, బలహీనతలు వంటి విషయాలను చెప్పవచ్చు. జనవరి‌తో కొత్త సంవత్సరం మొదలవుతుంది. అయితే జనవరి నెలలో పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు? మీరు కూడా జనవరి నెలలో పుట్టారా? అయితే మీ గురించి ఇప్పుడే తెలుసుకోండి.

శని ప్రభావం

శని న్యాయదేవుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడు పనులు చేస్తే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని మనకి కష్టపడడం, సహనం వంటి వాటిని నేర్పిస్తాడు. జనవరి నెలలో పుట్టిన వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జనవరి నెలలో పుట్టిన వారు కష్టపడి పని చేస్తారు.

ఎలాంటి ఛాలెంజ్‌లైనా స్వీకరించడానికి ముందుంటారు. జీవితానికి అర్థం బాగా తెలుసు. చిన్నప్పటి నుంచే జనవరిలో పుట్టిన వారికి జీవితానికి అర్థం తెలుసు. అందుకనే ఎప్పుడూ కూడా వారి ప్రవర్తన సరిగ్గా ఉంటుంది. జీవితానికి అర్థాన్ని చిన్న వయసులోనే తెలుసుకుంటారు. చక్కగా అన్నిటిలో కూడా బాగా రాణిస్తారు.

నాయకత్వ లక్షణాలు ఎక్కువ

జనవరి నెలలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ నెలలో పుట్టిన వారు ఇతరులను ఫాలో అవ్వరు. మిమ్మల్ని ఇతరులు ఫాలో అవుతారు. వీరు ఎక్కడుంటే అక్కడ ఇతరులకు సెక్యూరిటీ, నమ్మకం కలుగుతాయి. అందుకే అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. మీ సమక్షంలో ఉండాలని అనుకుంటారు.

కుటుంబాన్ని కూడా మార్చేస్తారు

జనవరి నెలలో పుట్టిన వారు కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రతికూలత తొలగిపోతుంది, సానుకూలత వ్యాపిస్తుంది. ప్రతిదీ వీళ్ళే బాధ్యత వహిస్తారు. వీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట సంతోషం ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, నెగటివిటీ అయినా తొలగిపోతుంది. వీరు ఉన్న ఇంట ఆనందం వెల్లువిరుస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More