న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పచ్చు. న్యూమరాలజీలో చూసినట్లయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి.

ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. అలాగే ప్రతి రాడిక్స్ సంఖ్యకు కూడా అధిపతి ఉంటారు. దాని ఆధారంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సంఖ్యల వారు చాలా ప్రత్యేకం. ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుకూలం ఎక్కువగా ఉంటుంది. పైగా అదృష్టం కూడా వారిని వెతుక్కుంటూ వస్తుంది. మరి మీరు కూడా వీరిలో ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది, అదృష్టం కూడా వీళ్లతోనే
రాడిక్స్ సంఖ్య 3
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. దీంతో ఏ తేదీల్లో పుట్టిన వారు గురుగ్రహం అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. గురువు సంపద, జ్ఞానం మొదలైన వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు, అదృష్టవంతులు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా సరే ఏదో ఒకలా సహాయాన్ని పొందుతారు. త్వరగా ఆ సమస్య నుంచి బయటపడతారు. అలాగే సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగా ఉంటాయి.
రాడిక్స్ సంఖ్య 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఉన్నత పదవులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
రాడిక్స్ సంఖ్య 5
{{/usCountry}}ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఉన్నత పదవులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది.
రాడిక్స్ సంఖ్య 5
{{/usCountry}}ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుని అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త విషయాలను కూడా నేర్చుకుంటారు. పైగా వీరికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
రాడిక్స్ సంఖ్య 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్రుని అనుగ్రహంతో సంతోషాలు ఉంటాయి. వాహనయోగం కూడా ఉంటుంది. దేనికీ లోటు ఉండదు. కళారంగంలో, మీడియాలో బాగా రాణిస్తారు.
రాడిక్స్ సంఖ్య 9
ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది. కుజుని అనుగ్రహంతో ఈ సంఖ్యకు చెందిన వారు ఎలాంటి కష్టం అయినా దాటగలరు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. అదృష్టం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. గ్రహాల అనుకూలంగా ఉండడంతో ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు.