న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒక్కో సంఖ్య వారు ఒక్క విధంగా ఉంటారు. కొన్ని సంఖ్యల వారికి డబ్బుకు లోటు ఉండదు, ఆర్థికపరంగా ఎప్పుడూ బాగానే ఉంటుంది.

మీరు కష్టపడి కష్టపడి అలసిపోయారా? అయినా సరే ఫలితాలు కనిపించట్లేదా? అయితే మీరు కూడా వీరిలో ఒకరు. ఈ తేదీల్లో పుట్టిన వారు హఠాత్తుగా సక్సెస్‌ని చూస్తారు. కష్టపడినప్పటికీ ఫలితం రాదని చింతించకండి. కొంత మంది లైఫ్‌లో త్వరగా సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఒక్క రాత్రిలో ఈ తేదీల్లో పుట్టిన వారి అదృష్టం మారిపోతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు.
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఒక్కసారిగా సక్సెస్ వస్తుంది.. మరి వారిలో మీరు ఉన్నారేమో చూసుకోండి
రాడిక్స్ సంఖ్యలు:
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 1 అవుతుంది. అలాగే 3, 12, 21 తేదీల్లో పుట్టిన వారు రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఏదైనా నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినట్లయితే రాడిక్స్ సంఖ్య 9 అవుతుంది.
రాడిక్స్ సంఖ్య 1: రాజు అవ్వడానికి పుడతారు
రాడిక్స్ సంఖ్య 1 వారు రాజులా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 22 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఈ తేదీల్లో పుట్టిన వారు కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. ఎక్కువగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అయ్యే అవకాశాలు ఉంటాయి.
రాడిక్స్ సంఖ్య 3: చాలా తెలివైన వారు
3 సంఖ్య వారు చాలా తెలివైన వారు. ఈ తేదీల్లో పుట్టిన వారు 32 నుంచి 35 సంవత్సరాల మధ్య సక్సెస్‌ను చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వస్తారు, కానీ సక్సెస్ వారి వెంట ఉంటుంది. హఠాత్తుగా వారికి ఊహించని విధంగా సక్సెస్ వస్తుంది.
రాడిక్స్ సంఖ్య 9: ధైర్యవంతులు
{{/usCountry}}3 సంఖ్య వారు చాలా తెలివైన వారు. ఈ తేదీల్లో పుట్టిన వారు 32 నుంచి 35 సంవత్సరాల మధ్య సక్సెస్‌ను చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వస్తారు, కానీ సక్సెస్ వారి వెంట ఉంటుంది. హఠాత్తుగా వారికి ఊహించని విధంగా సక్సెస్ వస్తుంది.
రాడిక్స్ సంఖ్య 9: ధైర్యవంతులు
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 9 వారు చాలా ధైర్యవంతులు. పైగా కష్టపడి పని చేస్తారు. అయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి కాస్త కోపం కూడా ఎక్కువే. గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక్కసారిగా ఊహించని సక్సెస్ వారికి వస్తుంది. స్పోర్ట్స్, సెక్యూరిటీ, మిలిటరీ రంగాల్లో బాగా రాణిస్తారు.
ఈ రాడిక్స్ సంఖ్యల్లో మీరు ఉంటే కచ్చితంగా ప్రయత్నాన్ని ఆపకండి. కష్టపడి పని చేయండి. కచ్చితంగా సక్సెస్ ఆలస్యంగా వస్తుంది, కానీ అది జీవితాంతం మిమ్మల్ని సంతోషంగానే ఉంచుతుంది, ఇబ్బందుల్ని తొలగిస్తుంది.