న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడానికి వీలవుతుంది. అలాగే న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా చెప్పడానికి అవుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు, ఆనందంగా ఉంటారు. వ్యాపారం, కెరీర్‌లలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
రాడిక్స్ నెంబర్ 7

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది దాకా రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వాటి ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ సంఖ్యకు అధిపతి కేతువు.
కేతువు జ్ఞానం, ఆధ్యాత్మికత, పదునైన మెదడుకు కారకుడు. కేతువు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. డబ్బు, విలాసవంతమైన జీవితం పొందుతారు. రాడిక్స్ నెంబర్ 7 కి చెందిన వారు ఎప్పుడూ విపరీతమైన అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి సమస్యలు రావు.
డబ్బు, ఆనందం, విలాసాలు
ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితం డబ్బు, విలాసాలు, ఆనందంతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో మంచి స్థాయికి చేరుకుంటారు, మంచి గుర్తింపు పొందుతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ముందుచూపు కూడా ఎక్కువ
ఈ తేదీల్లో పుట్టిన వారికి ముందుచూపు కూడా ఎక్కువ. ఎప్పుడూ ప్రతి విషయాన్ని సరిగ్గా అంచనా వేయడంలో సక్సెస్ అవుతారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం, కెరీర్‌లలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. వారు వేసే ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి.
అర్ధం అవ్వరు
ఈ తేదీల్లో పుట్టిన వారిని సులువుగా అర్థం చేసుకోలేరు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి భావాలను, ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారు. అది వీరి బలం అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇంకో మంచి గొప్ప క్వాలిటీ ఉంది. అదేంటంటే, ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. వీరికి ఎంతో శక్తి ఉంది. దాంతో సులువుగా అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. ఈజీగా సక్సెస్‌ను అందుకుంటారు.
{{/usCountry}}ఈ తేదీల్లో పుట్టిన వారిని సులువుగా అర్థం చేసుకోలేరు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి భావాలను, ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారు. అది వీరి బలం అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇంకో మంచి గొప్ప క్వాలిటీ ఉంది. అదేంటంటే, ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. వీరికి ఎంతో శక్తి ఉంది. దాంతో సులువుగా అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. ఈజీగా సక్సెస్‌ను అందుకుంటారు.
{{/usCountry}}