న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహమంటే ప్రాణం ఇస్తారు, ఎప్పుడూ మోసం చేయరు!

ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు. అత్యంత స్నేహపూర్వక సంఖ్యలు వీరు అని చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యల ద్వారా ఆ వ్యక్తి తాలూకా విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి రాడిక్స్ సంఖ్యను ఆధారంగా అతని స్వభావం తెలుసుకోవచ్చు.

Published on: Dec 25, 2025, 12:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సంఖ్యల వారికి అది ప్లస్ అయితే, అదే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి మైనస్ అవ్వచ్చు.

న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహమంటే ప్రాణం ఇస్తారు (gemini )
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహమంటే ప్రాణం ఇస్తారు (gemini )

స్నేహానికి ఎక్కువ విలువ

ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహం అంటే ప్రాణం ఇస్తారు. అత్యంత స్నేహపూర్వక సంఖ్యలు వీరు అని చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యల ద్వారా ఆ వ్యక్తి తాలూకా విషయాలను కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక వ్యక్తి రాడిక్స్ సంఖ్యను ఆధారంగా అతని స్వభావం ఎలా ఉంది, అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి వంటి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. రాడిక్స్ సంఖ్య ఒక వ్యక్తి గురించి అనేక విషయాలను తెలుపుతుంది. స్నేహంలో నెంబర్ వన్‌గా నిరూపించబడిన సంఖ్యల వారి గురించి ఈరోజు చూసేద్దాం.

ఈ తేదీల్లో పుట్టిన వారికి స్నేహం అంటే ఏంటో తెలుసు.. నిజమైన స్నేహితులు వీరు

ఈ తేదీల వారు హృదయపూర్వకంగా స్నేహితులతో కలిసిమెలిసి ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఏ రాడిక్స్ సంఖ్యల వారు మంచి స్నేహితులు? ఈ తేదీల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

రాడిక్స్ నెంబర్ 2:

ఏదైనా నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఈ సంఖ్యకు అధిపతి చంద్రుడు. ఈ వ్యక్తులు స్వభావరీత్యా ఎంతో మృదువుగా ఉంటారు. చాలా శ్రద్ధ, కళా స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి జీవితంలోకి ఎవరైనా వస్తే, సొంతంగా భావిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఆనందం కోసం ఏం చేయడానికైనా ముందుంటారు. ఇలా స్నేహం కోసం ఏదైనా చేసే మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు. ఒకవేళ కనుక ఆ నిజమైన స్నేహితుడు నమ్మకాన్ని బ్రేక్ చేస్తే, ఇక కనీసం వారి వైపుకూడా చూడరు.

రాడిక్స్ నెంబర్ 4:

ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 4 అవుతుంది. నాలుగు సంఖ్యకు అధిపతి రాహువు. ఈ కారణంగా ఈ తేదీల్లో పుట్టిన వారు అందరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు. ఉల్లాసంగా ఉంటారు. నెంబర్ నాలుగు వ్యక్తులకు ఎక్కువ స్నేహితులు ఉండరు. అయితే, తక్కువ స్నేహితులు ఉన్నప్పటికీ, మరణం వరకు వారిని వదిలిపెట్టరు. అందుకే ఇలాంటి వారు స్నేహితులుగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు.

రాడిక్స్ నెంబర్ 5:

ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. రాడిక్స్ సంఖ్య 5కి చెందిన వారు కూడా స్నేహపూర్వకంగా ఉంటారు. అందరితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వీరికి మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. అందరి హృదయాలను గెలుచుకుంటారు. స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు.

రాడిక్స్ నెంబర్ 6:

రాడిక్స్ నెంబర్ 6కి చెందిన వారు కూడా మంచి స్నేహితులే. ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు సున్నితంగా ఉంటారు. దీంతో ప్రతిదీ సులభంగా అర్థం చేసుకుంటారు. స్నేహితులకు ఏ కష్టం వచ్చినా కూడా వదిలిపెట్టరు. ఆ కష్టాన్ని కూడా తమ కష్టంగానే ఫీలవుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More