ఈ తేదీల్లో పుట్టిన వారు కుబేరుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు.. డబ్బుకు లోటే ఉండదు!

న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడానికి వీలవుతుంది. అలాగే న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా చెప్పడానికి అవుతుంది. న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది దాకా రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వాటి ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు.

Published on: Dec 29, 2025, 10:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందనేది చెప్పడానికి వీలవుతుంది. అలాగే న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా చెప్పడానికి అవుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు, ఆనందంగా ఉంటారు. వ్యాపారం, కెరీర్‌లలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ తేదీల్లో పుట్టిన వారు కుబేరుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు (pinterest)
ఈ తేదీల్లో పుట్టిన వారు కుబేరుని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు (pinterest)

రాడిక్స్ నెంబర్ 7

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది దాకా రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. వాటి ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. ఈ సంఖ్యకు అధిపతి కేతువు.

కేతువు జ్ఞానం, ఆధ్యాత్మికత, పదునైన మెదడుకు కారకుడు. కేతువు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. డబ్బు, విలాసవంతమైన జీవితం పొందుతారు. రాడిక్స్ నెంబర్ 7 కి చెందిన వారు ఎప్పుడూ విపరీతమైన అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి సమస్యలు రావు.

డబ్బు, ఆనందం, విలాసాలు

ఈ తేదీల్లో పుట్టిన వారి జీవితం డబ్బు, విలాసాలు, ఆనందంతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో మంచి స్థాయికి చేరుకుంటారు, మంచి గుర్తింపు పొందుతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ముందుచూపు కూడా ఎక్కువ

ఈ తేదీల్లో పుట్టిన వారికి ముందుచూపు కూడా ఎక్కువ. ఎప్పుడూ ప్రతి విషయాన్ని సరిగ్గా అంచనా వేయడంలో సక్సెస్ అవుతారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం, కెరీర్‌లలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. వారు వేసే ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి.

అర్ధం అవ్వరు

తేదీల్లో పుట్టిన వారిని సులువుగా అర్థం చేసుకోలేరు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరి భావాలను, ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారు. అది వీరి బలం అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారికి ఇంకో మంచి గొప్ప క్వాలిటీ ఉంది. అదేంటంటే, ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తారు. వీరికి ఎంతో శక్తి ఉంది. దాంతో సులువుగా అనుకున్న వాటిని పూర్తి చేస్తారు. ఈజీగా సక్సెస్‌ను అందుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More