రాడిక్స్ సంఖ్యల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి.

ఈ సంఖ్యల ఆధారంగా మనిషి గురించి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారాలు మొదలుపెడితే కుబేరులుగా మారిపోతారు. మరి అలాంటి వారు ఎవరు? ఏ సంఖ్యల వారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుందో చూసేద్దాం.
ఈ సంఖ్యల వారు వ్యాపారాన్ని మొదలుపెడితే తిరుగు ఉండదు. కుబేరులుగా మారిపోతారు.
రాడిక్స్ సంఖ్య 1
ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య ఒకటి అవుతుంది. సూర్యుడు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సూర్యుడు నాయకత్వ లక్షణాలు, ధైర్యం మొదలైన వాటికి కారకుడు.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో అద్భుతంగా రాణించగలరు. కన్సల్టెన్సీ, మేనేజ్మెంట్, జ్యువెలరీ, ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ బిజినెస్‌లలో బాగా సంపాదించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
రాడిక్స్ సంఖ్య 3
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య మూడు అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. గురువు అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టిన వారు జ్ఞానాన్ని బాగా సంపాదిస్తారు. ఈ సంఖ్య వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆగిపోరు.
రిస్క్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం ఆలోచించరు. తప్పుల నుంచి బాగా నేర్చుకుంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కలిగి ఉంటారు. ఏ వ్యాపారంలో అయినా పర్ఫెక్ట్గా రాణించగలరు. స్టేషనరీ, పుస్తకాలు మొదలైన వ్యాపారాల్లో బాగా రాణించగలరు.
రాడిక్స్ సంఖ్య 6
ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టినట్లయితే వారి సంఖ్య 6 అవుతుంది. శుక్రుడు సంపద, విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. ఈ సంఖ్య వారు వస్తువులను ఆకర్షణీయంగా ప్రదర్శించగలరు.
వ్యాపార రంగాల్లో ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగు ఉండదు. ఫ్యాషన్, బ్యూటీ వంటివి ఈ సంఖ్య వారికి బాగా కలిసి వస్తాయి. ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిజినెస్‌లలో కుబేరులుగా మారతారు.
{{/usCountry}}వ్యాపార రంగాల్లో ఈ తేదీల్లో పుట్టిన వారికి తిరుగు ఉండదు. ఫ్యాషన్, బ్యూటీ వంటివి ఈ సంఖ్య వారికి బాగా కలిసి వస్తాయి. ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిజినెస్‌లలో కుబేరులుగా మారతారు.
{{/usCountry}}