...
...
Next Story

వార ఫలాలు: సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఈ మూలాంకాల వారికి కెరీర్, డబ్బు, కుటుంబంలో కీలక మార్పులు

సెప్టెంబర్ 14 నుంచి 20, 2026 వరకు సంఖ్యాశాస్త్రం ప్రకారం 1 నుంచి 9 వరకు అన్ని మూలాంకాల వారికి ప్రధానంగా వేగాన్ని తగ్గించి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన వారంగా కనిపిస్తోంది. తొందరపాటు కంటే ఓర్పు, ఇతరుల అభిప్రాయాలకు గౌరవం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఈ కాలంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

Published on: Sep 14, 2026, 16:00:31 IST
Advertisement

సెప్టెంబర్ 14 నుంచి 20, 2026 వరకు ఉన్న ఈ వారంలో 1 నుంచి 9 వరకు అన్ని మూలాంకాల జాతకులకు సంఖ్యాశాస్త్రం ప్రకారం కెరీర్, ఆరోగ్యం, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

వార ఫలాలు: సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఈ మూలాంకాల వారికి కెరీర్, డబ్బు, కుటుంబంలో కీలక మార్పులు (AI)
వార ఫలాలు: సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు ఈ మూలాంకాల వారికి కెరీర్, డబ్బు, కుటుంబంలో కీలక మార్పులు (AI)

సంఖ్యాశాస్త్ర (న్యూమరాలజీ) అంచనాల ప్రకారం.. సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు గడుస్తున్న ఈ వారం ప్రతి ఒక్కరూ కాస్త వేగాన్ని తగ్గించి, పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవాల్సిన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పనికి వెంటనే ఫలితం రావాలని ఆశించడం కంటే, కొన్ని విషయాలలో సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం.

ఈ కాలంలో ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం మరియు బంధాలకు తగిన సమయం కేటాయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ, ప్రతి అడుగు ఆచితూచి వేయడం ఈ వారం మీకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

మూలాంకం 1 (1, 10, 19 లేదా 28 తేదీలలో పుట్టినవారు)

ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ఈ వారం తమ దూకుడును కొద్దిగా తగ్గించి, నిదానంగా వ్యవహరించాలి. ప్రతి పనిని నేనే చేయాలనే ధోరణి కంటే, తోటివారి సహకారంతో ముందుకు వెళ్లడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. వృత్తి జీవితంలో ఇతరుల సలహాలు మీ ప్రణాళికలను మరింత విజయవంతం చేస్తాయి. ఒత్తిడి లేదా అలసట వేధిస్తే విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో లేదా బంధువులతో మాట్లాడేటప్పుడు మీ స్వరంలో మృదుత్వం ఉండేలా చూసుకోండి. మీ చిన్నపాటి సర్దుబాటు ధోరణి మనస్పర్థలను ఇట్టే తొలగిస్తుంది.

మూలాంకం 2 (2, 11, 20 లేదా 29 తేదీలలో పుట్టినవారు)

మూలాంకం 2 వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా సాగిపోతుంది. మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే మీ నైపుణ్యం, ఓర్పుతో వ్యవహరించే తీరు ఈ సమయంలో మీకు లాభిస్తాయి. వృత్తిపరంగా నలుగురి సహకారం లభిస్తుంది. ఆగిపోయిన పనులకు ఇతరుల సహాయంతో మళ్లీ జీవం పోస్తారు. అయితే మానసిక ఆందోళనకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. మనసులో ఎప్పడో దాచుకున్న విషయాలను సన్నిహితులతో పంచుకోవడానికి ఇది సరైన సమయం.

మూలాంకం 3 (3, 12, 21 లేదా 30 తేదీలలో పుట్టినవారు)

మీరు అనుకున్న ప్రణాళికలలో కొద్దిగా సౌలభ్యాన్ని (ఫ్లెక్సిబిలిటీ) పాటించాల్సిన వారం ఇది. కార్యాలయంలో ఇతరుల మీద ఆధారపడాల్సి రావచ్చు, కాబట్టి ప్రతి పని మీ ఇష్టప్రకారమే జరగాలని పట్టుబట్టకండి. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంతో పాటు ఇతరుల వాదనకు కూడా చోటు ఇవ్వండి. భవిష్యత్తు గురించి అనవసరంగా టెన్షన్ పడటం మానుకోండి. కుటుంబ సభ్యులతో మీ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు, మీ అంతరంగాన్ని కూడా పంచుకోవడం ద్వారా బంధాలు బలపడతాయి.

మూలాంకం 5 (5, 14 లేదా 23 తేదీలలో పుట్టినవారు)

ఈ వారం పనుల వేగం మందగించడం మిమ్మల్ని కొద్దిగా అసహనానికి గురిచేయవచ్చు. ఎప్పుడూ వేగవంతమైన మార్పులను కోరుకునే మీకు ఈ నిదానం కాస్త ఇబ్బంది అనిపించినా, తొందర పాటు నిర్ణయాలు నష్టాన్ని మిగుల్చుతాయి. కొత్త వ్యక్తులను కలవడం, చర్చలు జరపడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. నిరంతరం శ్రమించకుండా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. సమస్యల నుంచి పారిపోకుండా ప్రేమగా, ఓపికగా మాట్లాడితే అన్ని చిక్కులూ వీడతాయి.

మూలాంకం 6 (6, 15 లేదా 24 తేదీలలో పుట్టినవారు)

బంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం ఈ వారం మీకు చాలా ముఖ్యం. ఇతరుల బాధ్యతలను నెరవేర్చడంలో మీరు ఎక్కువ సమయం గడపవచ్చు, కానీ అందరి భారాలను మీరే మోయాల్సిన అవసరం లేదు. వృత్తితో పాటు మీ స్వంత ఆరోగ్యానికి, వ్యక్తిగత అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో పాత కాలపు విభేదాలు ఏవైనా ఉంటే వాటిని చొరవగా మాట్లాడి పరిష్కరించుకోండి. నిజాయితీతో కూడిన సంభాషణ మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

మూలాంకం 7 (7, 16 లేదా 25 తేదీలలో పుట్టినవారు)

వారం మీ అంతర్ దృష్టి చాలా బలంగా పనిచేస్తుంది. చిన్నపాటి సూచనలు కూడా భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేయడానికి మీకు సహాయపడతాయి. ఆఫీసులో అందరూ బహిరంగంగా మాట్లాడకపోయినా, వాతావరణంలో వచ్చే మార్పులను మీరు ఇట్టే పసిగట్టగలరు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ఏకాంతంగా గడపండి. ధ్యానం లేదా మీకు ఇష్టమైన ప్రశాంత కార్యకలాపాలు చేయండి. సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా నమ్మకమైన వారితో పంచుకోండి.

మూలాంకం 8 (8, 17 లేదా 26 తేదీలలో పుట్టినవారు)

మీ వాదనను ఇతరులపై రుద్దాలని ప్రయత్నించకుండా, సర్దుకుపోయే ధోరణితో వ్యవహరించడం మంచిది. కఠినమైన వైఖరిని విడనాడి, సహకార మార్గాన్ని ఎంచుకుంటే అసాధ్యమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిదీ మీ నియంత్రణలోనే ఉండాలని కోరుకోవడం మానసిక బడలికను ఇస్తుంది. బంధుమిత్రులతో స్నేహపూర్వకంగా మెలిగితే పాత మనస్పర్థలు తొలగిపోతాయి.

మూలాంకం 9 (9, 18 లేదా 27 తేదీలలో పుట్టినవారు)

ఈ వారం ఇతరులకు అండగా నిలవడంలో మీరు ముందుంటారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేయడానికి స్పందిస్తారు, అయితే మీ సామర్థ్యానికి మించి అన్ని బాధ్యతలను మీరే భుజాన వేసుకోవద్దు. అందరితో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు రావడంతో పాటు ఇతరుల కోణాన్ని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ శక్తిని కాపాడుకోవడానికి అనవసర జోక్యాలకు దూరంగా ఉండండి. ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడటం మీకు ఈ వారం గొప్ప మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks