అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఆకాశంలో గ్రహాల గమనం అత్యంత ప్రత్యేకంగా మారనుంది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, శని తదితర గ్రహాల కలయిక వల్ల మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితి మరియు వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.

రానున్న వారం (అక్టోబర్ 11 నుంచి 17 వరకు) జ్యోతిష్య పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కాలంలో ఆకాశంలో శక్తివంతమైన గ్రహాల రాకపోకలు, సంచారాలు కొన్ని ప్రత్యేక రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులను తీసుకురానున్నాయి. వారం ప్రారంభంలో సూర్యుడు కన్యారాశిలో సంచరించి, అక్టోబర్ 17న తన నీచ రాశి అయిన తులలోకి ప్రవేశించనున్నారు. అదే సమయంలో శుక్రుడు తన స్వక్షేత్రమైన తులలో వక్రీ గమనంలో ఉండటంతో పాటు 'మాలావ్య రాజయోగం' ప్రభావం కొనసాగుతుంది.
దేవగురువు బృహస్పతి అత్యంత శక్తివంతమైన కర్కాటక రాశిలో ఉండగా, శని మీన రాశిలో వక్రీ చరణంలో పయనిస్తున్నాడు. గ్రహాల ఈ అరుదైన అమరిక కొన్ని రాశుల వారికి ఆర్థిక, కుటుంబ మరియు ఉద్యోగ రంగాల్లో అపూర్వమైన శుభ ఫలితాలను ప్రసాదిస్తోంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ రాశి అధిపతి అయిన బుధుడు, శుక్రుడు మరియు చంద్రుడు పంచమ భావంలో సంచరించడం వల్ల మీలో సృజనాత్మకత, సానుకూల శక్తి విశేషంగా పెరుగుతాయి.
మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి పురోగతి కనిపిస్తుంది. అయితే, మాటతీరుపై కాస్త సంయమనం పాటించడం మంచిది.
సింహ రాశి
{{/usCountry}}మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులో అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి పురోగతి కనిపిస్తుంది. అయితే, మాటతీరుపై కాస్త సంయమనం పాటించడం మంచిది.
సింహ రాశి
{{/usCountry}}సింహ రాశి వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మీలోని ఆత్మవిశ్వాసం, పరాక్రమం పెరిగి నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. శని ప్రభావం కారణంగా వ్యాపార భాగస్వామ్యాల్లో మంచి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ప్రయోజనం చేకూరినా, అప్పుడప్పుడు ఖర్చులు కూడా ఎదురుకావచ్చు. శని ప్రభావం నేపథ్యంలో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారం అదృష్టం తోడు నిలుస్తుంది. సుఖసౌఖ్యాలు పెరగడంతో పాటు ఆర్థికంగా తిరుగులేని పురోగతి సాధిస్తారు. బిజినెస్ పార్టనర్‌షిప్‌ల ద్వారా ఆశించిన లాభాలు అందుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన పనులు సజావుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామ్యంతో బంధం బలపడుతుంది.
కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు అద్భుతమైన అవకాశాలు తారసపడతాయి. అయితే, కుజుడు మరియు కేతుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
తులా రాశి
తులా రాశిలో శుక్రుడు, బుధుడు మరియు చంద్రుని కలయిక ఒక సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది. బుధుడి ప్రభావంతో మీ బౌద్ధిక సామర్థ్యం పెరిగి, క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా పరిష్కరిస్తారు.
ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లేదా గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. నష్టపోయిన వ్యాపారాలు మళ్లీ లాభాల బాట పడతాయి. ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకుండా ముందుకు సాగండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా లాభాల పంట పండుతుంది. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది అనుకూల సమయం. పదోన్నతులతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
కుటుంబంలో అందరి సహకారం లభించడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామయంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం మంచిది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం పరాక్రమం, ఉత్సాహం రెట్టింపు అవుతాయి. నూతన ప్రాజెక్టులకు లేదా వ్యాపారాలకు శ్రీకారం చుట్టడానికి ఇది అద్భుతమైన సమయం. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు వస్తాయి.
తల్లిదండ్రుల ఆశీస్సులు, మద్దతుతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మధురమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ వారం ఎంతో దోహదపడుతుంది.