సింహ రాశిలో చంద్రుడి సంచారం - నేటి నుంచి ఈ 5 రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్..! ఇక విజయాలే..
అక్టోబర్ 6 నుంచి చంద్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 8 వరకు సాగే ఈ గోచారంతో వృషభం, మిథునం, తులా సహా 5 రాశుల జాతకులకు అదృష్టం తలుపు తట్టనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో మనస్సుకు, మానసిక భావోద్వేగాలకు కారకుడైన చంద్ర భగవానుడు అత్యంత వేగంగా రాశి పరివర్తనం చెందుతుంటాడు. సాధారణంగా చంద్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి సుమారు రెండు రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 06న చంద్రుడు, సూర్య భగవానుడికి స్వక్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశించాడు. రాబోయే రెండు రోజులు, అంటే అక్టోబర్ 8 వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు.

ప్రసిద్ధ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…... కాలపురుషుడి చక్రంలో సింహ రాశి ఐదవ స్థానంగా ఉంటుంది. ఈ రాశికి సూర్యుడు అధిపతి. భానుడి రాశిలోకి చంద్రుడి రాక వల్ల సాధారణంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొన్ని హెచ్చుతగ్గులు లేదా మానసిక గందరగోళాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి సమయమైనప్పటికీ, మనస్సులో కొంత అయోమయం నెలకొంటుంది.
అయితే, ఈ గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు కలగనున్నాయి. ఈ రెండు రోజుల పాటు చంద్రుడి అనుగ్రహంతో ఏ ఏ రాశుల జాతకులు సకల సంపదలు, విజయాలు అందుకోనున్నారో ఇక్కడ తెలుసుకోండి……
వృషభ రాశి :
వృషభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. భూమి, ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం ఉంది. మీ ధైర్యసాహసాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. మేధో సంపత్తి పెరగడంతో పాటు ఊహించని ధనలాభం పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా శుభవార్త వింటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి.
మిథున రాశి :
మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తోబుట్టువులు, స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో చేసే ప్రయాణాలు విశేష లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగ, వ్యాపార ప్రదేశాల్లో మీ పనితనంతో పాటు నాయకత్వ పటిమను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. నిలిచిపోయిన పాత బాకీలు, రావలసిన సొమ్ము తిరిగి చేతికి అందుతుంది. వ్యాపారంలో గతంలో కంటే మెరుగైన పురోగతి కనిపిస్తుంది.
తులా రాశి :
సింహరాశిలో చంద్రుడి సంచారం వల్ల తులా రాశి జాతకులకు నూతన ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. మీ మనస్సులోని నెరవేరని కోరికలు నెరవేరే సమయం ఇది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములతో పాటు సామాజిక వర్గం నుంచి విశేష ప్రయోజనాలు పొందుతారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పాత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు.
కుంభ రాశి :
కుంభ రాశి వారికి వ్యాపార రంగంలో ఊహించని లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సమాజంలో హోదా, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
సింహ రాశి :
స్వరాశి అయిన సింహరాశి జాతకుల జీవితంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. మీలో ధనాత్మక శక్తి (పాజిటివ్ ఎనర్జీ) ప్రవహిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించి మనశ్శాంతి లభిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. శుభవార్తలు అందుకోవడంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో గొప్ప విజయం సాధిస్తారు. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే దిశగా అడుగులు పడతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

