అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటాము. ఈ సంవత్సరం ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? విశేషమైన పురుషోత్తమ మాసంలో వచ్చే ఈ ఏకాదశి తేదీ, సమయంతో పాటు పూజా విధానం, పఠించాల్సిన మంత్రాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

ఈ పద్మిని ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి లేదా కమల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయి. సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయి.
పద్మిని ఏకాదశి 2026
మామూలుగా ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. ప్రత్యేకమైన యోగం ఈ పద్మిని ఏకాదశి నాడు రాబోతోంది. ఈ ఏడాది అధిక మాసం కాబట్టి 26 ఏకాదశులు వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశిగా మనం జరుపుకుంటాము.
పద్మిని ఏకాదశి తేదీ, శుభ సమయం
అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పద్మిని ఏకాదశి మే 27, బుధవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి మే 26 ఉదయం 5:10కి మొదలవుతుంది. మే 27 ఉదయం 6:21తో ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఏకాదశి వ్రతాన్ని మే 27, బుధవారం నాడు జరుపుకోవాలి. వ్రత పారణ సమయం మే 28 ఉదయం 5:25 నుంచి 7:56 గంటల మధ్య ఉంటుంది.
పద్మిని ఏకాదశి ప్రాముఖ్యత
ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటాము. శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే అధిక మాసానికి అధిదేవత విష్ణువు. అందుకనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి అని కూడా అంటాము. శాస్త్రాల ప్రకారం చూసినట్లయితే అధిక మాసానికి అధిదేవత విష్ణువు. అందుకనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతో పుణ్యం కలుగుతుంది.
{{/usCountry}}ఈ నెలలో చేసే దానం, తపస్సు, జపానికి ఎన్నో రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. పద్మిని ఏకాదశి వ్రతం చేస్తే యజ్ఞాలు చేసినంత ఫలితం లభిస్తుంది.
భక్తిశ్రద్ధలతో పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే యజ్ఞాలు చేసినంత పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. చేసిన పాపాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. మోక్షం లభిస్తుంది.
పద్మిని ఏకాదశి నాడు పూజ ఎలా చేసుకోవాలి?
- విష్ణువు, లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోలను పెట్టి ఈరోజు ఆరాధించాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు కట్టుకోవాలి. విష్ణువు ముందు కూర్చుని ఉపవాస సంకల్పం చెప్పుకోండి.
- ఆ తర్వాత ఒక పీటపై వస్త్రం వేసి విష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టండి. ఈరోజు విష్ణువుకి ఎంతో ఇష్టమైన పసుపు పూలు, పసుపు రంగులో ఉండే పండ్లను సమర్పించండి. దీపం, ధూపాలతో పూజ చేయండి.
- తులసి దళాలను తప్పకుండా విష్ణువుకి సమర్పించండి. విష్ణు మంత్రాలను జపించి వ్రత కథను కూడా చదువుకోండి. ఏకాదశి నాడు జాగరణ చేస్తే కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది.
- ఈ విశేషమైన రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది.
- తర్వాత వచ్చే ద్వాదశి నాడు శుభ ముహూర్తంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది.