వినాయకుని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. బుద్ధి, విఘ్నాలకు అధిపతిగా వినాయకుడిని మనం పూజిస్తాము. అలాగే వినాయకుడి అనేక రూపాలు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రూపంగా పంచముఖి గణేశుడు ప్రసిద్ధి చెందాడు. ఐదు ముఖాలతో కనిపించే ఈ దైవ స్వరూపం ఐదు దిక్కులను మాత్రమే కాదు, మనిషి జీవితంలోని ఐదు ముఖ్యమైన చైతన్య స్థాయిలకు కూడా ప్రతీకగా భావిస్తారు. వేద సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, పంచముఖిని ఆరాధించడం వలన వివేకం, జ్ఞానం, రక్షణ, ఆధ్యాత్మిక పురోగతి, మానసిక ప్రశాంతత కలుగుతాయి.
పంచముఖి వినాయకుడి ప్రత్యేకత

పంచముఖి అంటే ఐదు ముఖాలు ఉన్న ఆ దివ్య స్వరూపం. ఈ రూపంలో ఉన్న గణపతిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రూపాన్ని ఆరాధిస్తే మానసిక సమతుల్యత, ధైర్యం, శుభ ఫలితాలు కూడా లభిస్తాయి.
పంచకోశ సిద్ధాంతం
వేదాలు, ఉపనిషత్తుల ప్రకారం చూసినట్లయితే, మానవ జీవితం పంచకోశాల ఆధారంగా నిర్మితమై ఉంటుందని వివరిస్తాయి. శరీరం నుంచి పరమానంద స్థితి వరకు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇవి వివరిస్తాయి.
అన్నమయ కోశం: ఇదే భౌతిక శరీరానికి సంబంధించినది. గ్రహాలు, నక్షత్రాలు, భూమి, ప్రకృతి, భౌతిక ప్రపంచం అన్నీ ఈ కోశంలో భాగంగా భావిస్తారు.
ప్రాణమయ కోశం: జీవశక్తికి, ప్రాణవాయువుకు సంబంధించిన కోశం. ప్రతి జీవిలో ప్రవహించే ప్రాణశక్తి ఈ కోశం ద్వారా వ్యక్తమవుతుందని వేదాలు తెలుపుతున్నాయి.
మనోమయ కోశం: మనసు, భావోద్వేగాలు, ఆలోచనలు ఈ కోశానికి సంబంధించినవి. ఇతర జీవుల నుంచి మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టే మానసిక సామర్థ్యానికి ఇది ప్రతీక.
విజ్ఞానమయ కోశం: జ్ఞానం, వివేకం, ఆత్మపరిశీలన, సత్యాన్ని గ్రహించే శక్తి ఈ కోశానికి సంకేతం. ప్రపంచ మాయను అధిగమించి ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించే స్థితిని ఇది సూచిస్తుంది.
ఆనందమయ కోశం: పంచకోశాల్లో అత్యున్నతమైనది. ఇది ఆధ్యాత్మిక ఆనందం, పరమచైతన్యం, పరబ్రహ్మతో ఏకత్వాన్ని సూచిస్తుంది.
ఐదు ముఖాలు.. ఐదు మహాభూతాలు
{{/usCountry}}ఆనందమయ కోశం: పంచకోశాల్లో అత్యున్నతమైనది. ఇది ఆధ్యాత్మిక ఆనందం, పరమచైతన్యం, పరబ్రహ్మతో ఏకత్వాన్ని సూచిస్తుంది.
ఐదు ముఖాలు.. ఐదు మహాభూతాలు
{{/usCountry}}పంచముఖి గణేశుడి ఐదు ముఖాలు పంచకోశాలతో పాటు వాయువు, అగ్ని, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూతాలకు కూడా ప్రతీకగా భావిస్తారు. ఈ ఐదు తత్వాలు సమస్త సృష్టికి మూలమని వేదాలు చెబుతున్నాయి.
నాలుగు దిక్కులకు రక్షకుడు
పంచముఖి గణేశుడు నాలుగు దిక్కులను రక్షించే దైవశక్తిగా భావించబడతాడు. భక్తులను బాహ్య, అంతర్గత అడ్డంకుల నుంచి కాపాడే శక్తి ఈ రూపానికి ఉంటుందని నమ్మకం.
పంచముఖి వినాయకుడిని పూజిస్తే కలిగే ఫలితాలు
పంచముఖి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ధైర్యం, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతిని కూడా పొందవచ్చు.