మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. పరాభవనామ సంవత్సరంలో చాలా రాశి ఉన్నవారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. మేషరాశి వారికి కొత్త తెలుగు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? పరాభవనామ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
పరాభవనామ సంవత్సరం మేష రాశికి ఎలాంటి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది?

ఈ రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు తృతీయ స్థానంలో ఉండడంతో ధన నాశనం కలుగుతుంది. జూన్ 2 నుంచి చతుర్థ స్థానంలో గురువు సౌభాగ్యకరమైన ఫలితాలను అందిస్తాడు. శని వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు, కేతువులు 2026 డిసెంబర్ 5 దాకా వ్యయ, షష్ఠ స్థానాలలో తామ్రమూర్తులుగా సంచరిస్తారు. తర్వాత డిసెంబర్ 6 నుంచి సామాన్య ఫలితాలను ఇస్తారు. ఈ కొత్త ఏడాది విద్యాయోగం కలుగుతుంది. ఆకస్మికంగా గృహ, వాహనాలను కొనుగోలు చేస్తారు.
అధిక లాభాలు
ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల సపోర్ట్ ఉంటుంది. పదోన్నతులు కలుగుతాయి. సహ ఉద్యోగులు అనుకూలంగా ఉంటారు. గృహ నిర్మాణాల్లో కూడా లాభాలు కలుగుతాయి. కుటుంబం, గృహ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. తల్లి నుంచి ఆస్తిని పొందుతారు. వ్యాపారులకు కూడా కొత్త ఏడాది అధిక లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు చేసే పనుల్లో ఉత్సాహాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కొత్త ఏడాది లాభాలు కలుగుతాయి. నూతన నిర్మాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. శని సంచారం వలన ఒత్తిడులు తగ్గుతాయి.
క్రమశిక్షణతో అన్నిటిలో విజయాలను అందుకుంటారు. జూలై 26 నుంచి డిసెంబర్ 11 దాకా శని రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో తిరోగమనం చేయడం వలన కుటుంబ వ్యాపార ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార అవసరాల కోసం తక్కువ స్థాయి వారితో స్నేహం చేస్తారు. రాజకీయపరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుంచి సంపద పొందడానికి ప్రయత్నిస్తారు. ఇక మేష రాశి వారి నెలవారి ఫలితాలు కూడా చూద్దాం.
మేష రాశి వారికి ఏ నెలలో ఎలా ఉంటుంది?
మార్చి 2026:
{{/usCountry}}క్రమశిక్షణతో అన్నిటిలో విజయాలను అందుకుంటారు. జూలై 26 నుంచి డిసెంబర్ 11 దాకా శని రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో తిరోగమనం చేయడం వలన కుటుంబ వ్యాపార ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార అవసరాల కోసం తక్కువ స్థాయి వారితో స్నేహం చేస్తారు. రాజకీయపరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుంచి సంపద పొందడానికి ప్రయత్నిస్తారు. ఇక మేష రాశి వారి నెలవారి ఫలితాలు కూడా చూద్దాం.
మేష రాశి వారికి ఏ నెలలో ఎలా ఉంటుంది?
మార్చి 2026:
{{/usCountry}}మార్చి నెలలో మేష రాశి వారు ఆస్తుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థికపరంగా సామాన్య స్థితి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండాలి.
ఏప్రిల్ 2026:
ఈ నెలలో ఆలోచన విధానంలో ఎంతో మార్పు వస్తుంది. భోగభాగ్యాలు, సుఖసౌఖ్యాలు పొందుతారు. ఈ నెల చివర్లో ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది.
మే 2026:
ఈ నెలలో ధన వృద్ధి కలుగుతుంది. అధికార హోదాను పెంచుకుంటారు. సంతానం గురించి కలత కలుగుతుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది.
జూన్ 2026:
ఇతరులతో విభేదించడం వలన భయం, ఆందోళన కలుగుతాయి. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పట్టుదలతో విజయాలను అందుకుంటారు. ప్రయాణ భారం, శారీరక శ్రమ, ఒత్తిడి ఈ నెలలో ఉంటాయి.
జూలై 2026:
ఈ నెలలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. సంతానం సరైన మార్గంలో ఉండడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూల సమయం. శ్వాసకోశ, రక్తప్రసరణ సంబంధిత అనారోగ్య సమస్యలు కలగవచ్చు.
ఆగస్టు 2026:
ఈ నెలలో సంతానం వృద్ధిలోకి రావడంతో ఆనందం పెరుగుతుంది. భూ లాభం, ధనవ్యయం ఉంటాయి. అస్వస్థత నుంచి బయటపడతారు. వైద్య సహాయం ఈ నెలలో అవసరం అవుతుంది.
సెప్టెంబర్ 2026:
ఈ నెలలో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ధైర్యం పెరుగుతుంది. ప్రణాళికతో విజయాలను చేరుకుంటారు. విద్యార్థులు ఈ నెలలో బాగా రాణిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
అక్టోబర్ 2026:
సూర్యుడు తప్ప అన్ని గ్రహాలు కూడా అనుకూల స్థానాల్లో లేవు. దీంతో శత్రువులు పెరగడం, ధన వ్యయం, ధన యోగం తగ్గడం వంటి పరిస్థితులు కలుగుతాయి.
నవంబర్ 2026:
సంతాన వృద్ధి, మనోవికాసం కలుగుతుంది. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగ లాభాన్ని కూడా పొందుతారు. నూతన వ్యాపార అదృష్టం కూడా ఉంటుంది.
డిసెంబర్ 2026:
తక్కువ వారితో స్నేహం చేయడం, మాట పట్టింపులు, వైరం కారణంగా నష్టాలు ఎదురవుతాయి. ఈ నెల రెండో వారం అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ధనవ్యయం, ధనహీనత ఉండే అవకాశం ఉంది.
జనవరి 2027:
ఈ నెల చివర్లో బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో లాభాలు ఉంటాయి. గౌరవాన్ని పొందుతారు. సంతోషంగా ఉంటారు.
ఫిబ్రవరి 2027:
విద్యా విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. గృహ యోగం ఉంటుంది. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆభరణాలను కూడా ఈ నెలలో కొనుగోలు చేస్తారు. కుటుంబ వృద్ధి కలుగుతుంది.
మార్చి, ఏప్రిల్ 2027:
ఈ రెండు నెలలు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఇతరులకు మీరు తోడుగా ఉంటారు. చేతికి ధనం బాగా అందుతుంది. ఎప్పటినుంచో పరిష్కారం అవ్వని సమస్యలను కూడా ఈ నెలలో మీరు పరిష్కరిస్తారు.