అధికమాసం చాలా విశేషమైనది. అలాగే మన హిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి తిథికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో ఏకాదశి ఇంకా విశేషమైనదని చెప్పొచ్చు.

అధికమాసంలో వచ్చే ఏకాదశిని "పరమ ఏకాదశి" అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తిథి. ఈ మాసంలో శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతిని కూడా పొందవచ్చు. మహా యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుంది.
రేపే పరమ ఏకాదశి 2026
పరమ ఏకాదశి 2026 రేపు, అనగా జూన్ 11న వచ్చింది. పంచాంగం ప్రకారం జూన్ 11న తెల్లవారుజామున 12:57కి ఏకాదశి తిథి మొదలవుతుంది. అదే రోజు రాత్రి 10:30తో ముగుస్తుంది. రేపు శ్రీహరికి పూజలు చేసి ఉపవాసం ఉంటే చక్కటి ఫలితాన్ని చూడొచ్చు. ప్రత్యేక పూజలు చేయడానికి ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు అనుకూలంగా ఉంది. ఈ సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు.
ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?
జూన్ 12, శుక్రవారం నాడు ఉపవాసాన్ని విరమించాలి. వ్రతభంగం కాకుండా ఉండడానికి ఉదయం 5:23 నుంచి 8:10 లోపు ఉపవాస విరమణ పూర్తి చేయాలి. అప్పుడే వ్రతం పూర్తి ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.
ఈ వ్రతం ఎందుకు శక్తివంతమైనది?
"పరమ" అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.
ఈరోజు ఏం చదువుకోవాలి?
{{/usCountry}}"పరమ" అంటే అత్యున్నతమైనది, శ్రేష్ఠమైనది. పురాణాల ప్రకారం ఈ రోజు మహావిష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.
ఈరోజు ఏం చదువుకోవాలి?
{{/usCountry}}విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" మంత్రాన్ని జపించండి.
దానాలు
పరమ ఏకాదశి నాడు పేదలకు, అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం, ఆర్థిక సహాయం వంటివి చేస్తే అక్షయ పుణ్యఫలాలను పొందడానికి వీలవుతుంది.
ఐశ్వర్యం కలగాలంటే ఈ పరిహారాలను పాటించండి
11 గవ్వలు
పూజ చేసేటప్పుడు 11 గవ్వలు లేదా నాణేలను పసుపు వస్త్రంలో చుట్టి దేవుడి పీఠం దగ్గర పెట్టండి. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆ మూటను డబ్బులు దాచుకునే చోట భద్రపరచండి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.
లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించండి
మఖానా లేదా సగ్గుబియ్యంతో ఖీర్ చేసి లక్ష్మీదేవికి సమర్పించండి. నైవేద్యం పెట్టాక కుటుంబ సభ్యులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టండి.
తులసి కోట దగ్గర నెయ్యి దీపం
ఈ పవిత్రమైన ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లక్ష్మీనారాయణులను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఇలా చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.