హిందూ సనాతన ధర్మంలో పూజలకు, పువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ దైవిక సుగంధాలు వెదజల్లే పారిజాత పూలు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. పౌరాణిక గాథల ప్రకారం సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఈ దివ్య వృక్షం, దేవతలకు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కేవలం విష్ణుమూర్తి పూజలోనే కాకుండా, లయకారకుడైన పరమశివుడి పూజలో కూడా పారిజాత పూలను సమర్పిస్తుంటారు. అయితే, శివలింగానికి ఈ పూలు సమర్పించే విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
చెట్టు నుంచి కోసి పూజకు వాడకూడదు

సాధారణంగా ఏ దేవునికైనా చెట్టు నుండి తాజా పూలను కోసి సమర్పించడం ఆనవాయితీ. కానీ, పారిజాత పూల విషయంలో ఈ నియమం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పారిజాత చెట్టు నుంచి పూలను బలవంతంగా కోసి శివునికి లేదా ఇతర దేవుళ్లకు అర్పించకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పూల ప్రత్యేకతేమిటంటే.. రాత్రి సమయంలో వికసించి, తెల్లవారేసరికి వాటంతట అవే చెట్టు నుంచి కింద రాలిపోతాయి. అందుకే, నేల రాలిన తాజా పూలనే సేకరించి పూజకు ఉపయోగించాలి. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారానే పరిపూర్ణమైన పూజాఫలం లభిస్తుందని నమ్ముతారు.
కడిగి ఉపయోగించాల్సిన అవసరం లేదు
చెట్టు నుంచి సహజంగా కింద పడిపోయిన పారిజాత పూలను మళ్లీ నీటితో కడగాల్సిన అవసరం లేదు. భూమిపై పడినప్పటికీ, ఈ పూలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అయితే, నేల నుంచి ఏరుకునేటప్పుడు ఆ పూలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎలాంటి మలినాలు అంటకుండా ఉన్న స్వచ్ఛమైన పూలను నేరుగా భగవంతునికి సమర్పించవచ్చు. అనవసరంగా వీటిని కడగడం వల్ల వాటిలో ఉండే సువాసన, పవిత్రత తగ్గే అవకాశం ఉంటుంది.
శివపూజలో పారిజాత ప్రాముఖ్యత
మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మారేడు దళాలు (బిల్వపత్రాలు), ఉమ్మెత్త పూలు వంటి వాటిని సమర్పిస్తుంటారు. వీటితో పాటు పారిజాత పూలను కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో పరమశివుడికి ఈ పూలను సమర్పిస్తే భక్తుల మనసులోని కోరికలు నెరవేరుతాయని గాఢమైన నమ్మకం ఉంది. అంతేకాకుండా, శ్రీకృష్ణ భగవానుడు స్వర్గం నుంచి ఈ వృక్షాన్ని భూమికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే విష్ణు, కృష్ణ భక్తి సంప్రదాయాలలోనూ ఈ పూలకు విశేష స్థానం దక్కింది.
ఇంట్లో పారిజాత మొక్క ఉంటే కలిగే లాభాలు
{{/usCountry}}మహాశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మారేడు దళాలు (బిల్వపత్రాలు), ఉమ్మెత్త పూలు వంటి వాటిని సమర్పిస్తుంటారు. వీటితో పాటు పారిజాత పూలను కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో పరమశివుడికి ఈ పూలను సమర్పిస్తే భక్తుల మనసులోని కోరికలు నెరవేరుతాయని గాఢమైన నమ్మకం ఉంది. అంతేకాకుండా, శ్రీకృష్ణ భగవానుడు స్వర్గం నుంచి ఈ వృక్షాన్ని భూమికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే విష్ణు, కృష్ణ భక్తి సంప్రదాయాలలోనూ ఈ పూలకు విశేష స్థానం దక్కింది.
ఇంట్లో పారిజాత మొక్క ఉంటే కలిగే లాభాలు
{{/usCountry}}ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు ఆరోగ్య పరంగా, వాస్తు పరంగా కూడా పారిజాత మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెల్లటి రేకులు, నారింజ రంగు కాడలతో ఉండే ఈ పూలు రాత్రిపూట వికసించి ఇల్లంతా సువాసనలతో నింపుతాయి.
ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల సానుకూల శక్తి (Positive Energy) వెలువడుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క ఆకులు, కాండం వివిధ అనారోగ్య సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.