పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో భోళాశంకరుని అనుగ్రహం కోసం భక్తులు రకరకాల నోములు, పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పవిత్ర రోజుల్లో శివలింగానికి జలాభిషేకం చేయడం ఎంత ఫలాన్ని ఇస్తుందో, పార్థివ శివలింగాన్ని (మట్టితో చేసిన శివలింగం) తయారు చేసి ఆరాధించడం కూడా అంతే విశేషమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మహాలింగానికి చేసే రుద్రాభిషేకంలోనూ ఈ మట్టి శివలింగ ఆరాధనకే ప్రాధాన్యత ఇస్తారు.

అసలు శివపురాణం ప్రకారం పార్థివ శివలింగాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి….? పూజ పూర్తయిన తర్వాత ఆ శివలింగాన్ని ఏం చేయాలి? తయారీలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శివ పురాణం స్పష్టం చేస్తున్న దాని ప్రకారం…. మట్టితో చేసిన శివలింగాన్ని లేదా శివుని రూపాన్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మానవుని కోరికలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా అకాల మరణ భయం నుంచి విముక్తి లభిస్తుంది.
- పాప ప్రక్షాళన : శివుని పార్థివ రూపాన్ని విధివిధానంగా ఆరాధించడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. జీవితంలోని సకల దుఃఖాలు, కష్టాలు తొలిగిపోతాయి.
- ఐశ్వర్యం - మోక్ష ప్రాప్తి : ఈ పూజ వల్ల భక్తులకు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు లభించడమే కాకుండా, పునర్జన్మ లేని మోక్ష మార్గం సుగమమవుతుంది.
- జగత్ పితరుల అనుగ్రహం : శివపురాణంలో పార్వతీ దేవిని జగజ్జననిగా, పరమశివుడిని జగత్పితగా వర్ణించారు. ఈ దంపతులను పార్థివ రూపంలో సేవించే వారిపై వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి.
ముఖ్య నియమాలు…
మట్టి శివలింగాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని శాస్త్రోక్తమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి.
- శివలింగ నిర్మాణం కోసం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, పవిత్రమైన స్థలం నుంచి తీసిన మట్టిని మాత్రమే ఉపయోగించాలి.
- శివలింగాన్ని తయారు చేసే సమయంలో సాధకుడు తన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉంచుకోవాలి.
- పార్థివ శివలింగం పరిమాణం మరీ పెద్దదిగా ఉండకూడదు. ఇంట్లో పూజించేటప్పుడు ఇది బొటనవేలు ఎత్తు లేదా గరిష్టంగా 12 వేళ్ల ఎత్తు మించకుండా చూసుకోవడం శ్రేయస్కరం.
పార్థివ శివలింగాన్ని ఆరాధించిన తర్వాత దాని నిమజ్జన ప్రక్రియ చాలా కీలకమైనది. శాస్త్ర నియమాల ప్రకారం పూజ పూర్తయిన వెంటనే లేదా అదే రోజు సూర్యాస్తమయానికి ముందే శివలింగాన్ని నది, చెరువు లేదా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయాలి. పార్థివ శివలింగాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంచడం గానీ… మరుసటి రోజు వరకు ఉంచడం గానీ శుభప్రదం కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
{{/usCountry}}పార్థివ శివలింగాన్ని ఆరాధించిన తర్వాత దాని నిమజ్జన ప్రక్రియ చాలా కీలకమైనది. శాస్త్ర నియమాల ప్రకారం పూజ పూర్తయిన వెంటనే లేదా అదే రోజు సూర్యాస్తమయానికి ముందే శివలింగాన్ని నది, చెరువు లేదా పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయాలి. పార్థివ శివలింగాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంచడం గానీ… మరుసటి రోజు వరకు ఉంచడం గానీ శుభప్రదం కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
{{/usCountry}}