శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఎదుర్కోక తప్పదు. చాలా మంది శని అనుగ్రహం కలగడానికి రకరకాల పరిహారాలను పాటిస్తారు. ముఖ్యంగా శనివారం నాడు శనికి సంబంధించిన పరిహారాలను పాటించడానికి మనం చూస్తూ ఉంటాం. శని అనుగ్రహం పొందడం అంత ఈజీ కాదు. కానీ ఈ రోజుల్లో జన్మించిన వ్యక్తులు మాత్రం శనిదేవుని దయతో ఎల్లప్పుడూ అనుగ్రహంగా ఉంటారు. కష్టపడితే విజయం సాధిస్తారు.
రాడిక్స్ సంఖ్య 9

న్యూమరాలజీలో ఒకటి నుంచి తొమ్మిది వరకు రాడిక్స్ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చు.
రాడిక్స్ సంఖ్య 9 వారు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల దయతో ఉంటారు. ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను కూడా ఏమాత్రం వదిలిపెట్టరు. శని దయతో ఈ సంఖ్యకు చెందిన వారు కష్టం పడిన తర్వాత అపారమైన విజయాన్ని సాధిస్తారు. నిజాయితీగా ఉంటారు. అలాగే విధేయతను కలిగి ఉంటారు. వారు బాధ్యతలతో ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేస్తారు. రాడిక్స్ సంఖ్య తొమ్మిది వారి ప్రవర్తన అందర్నీ ఆకట్టుకుంటుంది.
రాడిక్స్ సంఖ్య 9 వారి కెరీర్ ఎలా ఉంటుంది?
రాడిక్స్ సంఖ్య 9 వారు సామాజిక సేవ, ప్రభుత్వ ఉద్యోగం, న్యాయం, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో బాగా రాణిస్తారు. ఈ రంగాలు వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. సహనం, నాయకత్వం, సామర్థ్యాన్ని వీరు పూర్తిగా ఉపయోగిస్తారు. రియల్ ఎస్టేట్, విద్యారంగంలో కూడా ఈ తేదీల్లో పుట్టిన వారు సులువుగా సక్సెస్ అవుతారు. శని దయతో ఆలస్యమైనా విజయాన్ని మాత్రం అందుకుంటారు.
ప్రేమ జీవితం ఎలా ఉంటుంది?
రాడిక్స్ సంఖ్య తొమ్మిది వారి ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఎప్పుడూ కూడా నమ్మకంగా, అంకితభావంతో ఉంటారు. జీవిత భాగస్వామి కోసం త్యాగం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. దీంతో సంబంధం బలపడుతుంది. అలాగే ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో శాశ్వతంగా ఉంటారు. వదిలిపెట్టడం వీరికి తెలియదు. వివాహ జీవితంలో కూడా ఎల్లప్పుడూ భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూస్తారు. బాధ్యతగా వ్యవహరిస్తారు.
అనుకూలమైనవి, ప్రతికూలమైనవి
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య తొమ్మిది వారి ప్రేమ జీవితం విషయానికి వస్తే, ఎప్పుడూ కూడా నమ్మకంగా, అంకితభావంతో ఉంటారు. జీవిత భాగస్వామి కోసం త్యాగం చేయడానికి కూడా రెడీగా ఉంటారు. దీంతో సంబంధం బలపడుతుంది. అలాగే ఎప్పుడూ కూడా రిలేషన్షిప్లో శాశ్వతంగా ఉంటారు. వదిలిపెట్టడం వీరికి తెలియదు. వివాహ జీవితంలో కూడా ఎల్లప్పుడూ భాగస్వామిని సంతోషంగా ఉండేలా చూస్తారు. బాధ్యతగా వ్యవహరిస్తారు.
అనుకూలమైనవి, ప్రతికూలమైనవి
{{/usCountry}}రాడిక్స్ సంఖ్య 9 వారికి నలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ముదురు నీలం, బూడిద రంగు కూడా బాగా కలిసి వస్తాయి. తెలుపు, లైట్ కలర్స్ మాత్రం ఈ తేదీల్లో పుట్టిన వారికి నష్టాలను తీసుకువస్తాయి. ఇనుము, వెండి లోహాలు బాగా కలిసి వస్తాయి. శనివారం, మంగళవారం ఈ తేదీల్లో పుట్టిన వారికి అదృష్ట రోజులు. రాడిక్స్ సంఖ్య 3, 6, 9 వారితో స్నేహం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
రాడిక్స్ సంఖ్య 1, 5 వారితో మాత్రం జాగ్రత్తగానే వ్యవహరించాలి. శని గ్రహంతో లోతైన అనుబంధం ఉండడం వలన ఈ తేదీల్లో పుట్టిన వారు ఎల్లప్పుడూ జీవితంలో అగ్రస్థానంలో ఉంటారు. శని మంత్రాన్ని పఠిస్తే అదృష్టం మరింత పెరుగుతుంది. జీవితం ప్రకాశవంతంగా మారుతుంది.