...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన వారు ఆఫీస్ పాలిటిక్స్‌ను ఇట్టే పసిగట్టేస్తారు.. వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదు!

ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో ఆఫీస్ పాలిటిక్స్, వెన్నుపోటు రాజకీయాలు సర్వసాధారణంగా మారిపోయాయి. పైకి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూనే వెనుక నుంచి ఇబ్బందులు సృష్టించే వారిని గుర్తించడం అంత సులభం కాదు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఆఫీస్ పాలిటిక్స్‌ను ఇట్టే పసిగట్టేస్తారు.

Published on: Nov 18, 2026, 16:00:25 IST
Advertisement

ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో 'ఆఫీస్ పాలిటిక్స్' అనేది సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది పైకి ఎంతో ఆప్యాయంగా పలకరించినప్పటికీ, వెనుక నుంచి గోతులు తవ్వుతుంటారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించడం సామాన్యమైన విషయం కాదు.

ఈ తేదీల్లో పుట్టిన వారు ఆఫీస్ పాలిటిక్స్‌ను ఇట్టే పసిగట్టేస్తారు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆఫీస్ పాలిటిక్స్‌ను ఇట్టే పసిగట్టేస్తారు

ఎంతోమంది తీపి మాటలకు మోసపోయి ఇబ్బందులు పడుతుంటారు. అయితే, సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం కొన్ని ప్రత్యేక మూలాంకాలకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతటి వారినైనా ఇట్టే పసిగట్టేస్తారు. ఎవరి మనసులో ఏముందో ఇట్టే గ్రహించే ఈ 4 మూలాంకాల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

మూలాంకం 1:

ఏదైనా నెలలో 1, 10, 19 లేదా 28వ తేదీలలో జన్మించిన వారి మూలాంకం 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యభగవానుడు. ఈ మూలాంకం ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు ఎవరి ఒత్తిడికీ తలొగ్గడానికి ఇష్టపడరు. కార్యాలయంలో ఎవరైనా తమ స్వార్థం కోసం పొగడ్తలు కురిపించినా వీరు ఇట్టే గ్రహిస్తారు. ఎదుటివారి వేషాలు వీరు ఇట్టే పసిగట్టగలరు కాబట్టి వీరిని ఎవరూ సులభంగా మోసం చేయలేరు.

మూలాంకం 4:

నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీలలో పుట్టినవారికి రాహువు అధిపతిగా ఉంటాడు. ఈ మూలాంకం వారు ఎవరినైనా గుడ్డిగా నమ్మడానికి చాలా ఆలోచిస్తారు. ఆఫీసులో ఎవరైనా వీళ్లను ఇబ్బంది పెట్టాలని చూసినా, లేదా ఓవర్‌స్మార్ట్ ప్రవర్తించినా వెంటనే పసిగడతారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ వ్యక్తులను ఎవరూ సులభంగా మాయమాటలతో మోసం చేయలేరు.

మూలాంకం 7:

7, 16 లేదా 25వ తేదీలలో జన్మించిన వ్యక్తుల మూలాంకం 7 అవుతుంది. ఈ సంఖ్యకు కేతువు అధిపతి. వీరు సాధారణంగా చాలా మౌనంగా ఉంటారు కానీ, చుట్టూ ఏం జరుగుతుందనే దానిపై నిశితమైన దృష్టి పెడతారు. ఆఫీసులో ఎవరు ఎలాంటి ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారో ఇట్టే పసిగట్టేస్తారు. అన్ని విషయాలను లోతుగా అంచనా వేసుకున్న తర్వాతే వీరు ఒక నిర్ణయానికి వస్తారు.

మూలాంకం 8:

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks