...
...
Next Story

ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రేమ జీవితం ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.. వారి భాగస్వామి అదృష్టవంతులు!

న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా మూలంకాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి మూలంకానికి ఒక గ్రహం అధిపతిగా ఉండటంతో, వ్యక్తిత్వం, ప్రవర్తన, సంబంధాలు, ప్రేమ జీవితంపై ప్రభావం ఉంటుందని న్యూమరాలజీలో భావిస్తారు. మూలంకం 5 వారికి స్వేచ్ఛ, కొత్తదనం, వ్యక్తిగత సమయం ముఖ్యంగా ఉంటాయి.

Published on: Sep 30, 2026, 08:00:37 IST
Advertisement

న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. దీనినే మూల అంకం అంటారు. మూల అంకాలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ గ్రహాలు వ్యక్తిత్వం, ప్రవర్తన, సంబంధాలు, నిజాయితీ, జీవితంలో వివిధ అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రేమ జీవితం ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.. వారి భాగస్వామి అదృష్టవంతులు! (AI)
ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రేమ జీవితం ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.. వారి భాగస్వామి అదృష్టవంతులు! (AI)

ప్రేమ జీవితం విషయానికి వస్తే, ప్రతి సంఖ్య మరియు ప్రేమను వ్యక్తపరిచే విధానం, సంబంధాలను కొనసాగించే తీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. మూలంకం ఐదు వారు స్వేచ్ఛ, కొత్తదానికి ప్రాధాన్యత ఇస్తారు. మూలంకం ఆరు వారు సాన్నిహిత్యం, ప్రేమ, స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు. ఈరోజు ఈ రెండు సంఖ్యలకి సంబంధించిన వారి గురించి చూద్దాం.

మూలాంకం ఐదు

మూలాంకం ఐదు అంటే ఏదైనా నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే మూలంకం ఐదుగా పరిగణిస్తారు. మూలంకం ఐదుకి అధిపతి బుధుడు. ఈ సంఖ్యలు వారు సామాజికంగా చురుకుగా ఉంటారు. స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే, మూలంకం 5 వారు ఇతరుల పట్ల త్వరగా ఆకర్షితులు అవుతారు.

వారి సంభాషణ తీరు, చమత్కారమైన మాటలను భాగస్వాములు ఇష్టపడతారు. అలాగే, వారు భావాలను బహిరంగంగా వ్యక్తపరుస్తారు. సంబంధాల్లో కొత్తదనాన్ని కోరుకుంటారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయడం వీరికి చాలా ఇష్టం. మూలంకం 5 వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తిగత సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామి ఎక్కువ జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు విభేదాలు ఈ కారణంగా ఏర్పడే అవకాశం ఉంది.

మూలాంకం ఆరు

రొమాన్స్, డేటింగ్‌కి వెళ్లడం, భాగస్వామితో కలిసి ఎక్కువ సమయాన్ని గడపడం అంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి మహా ఇష్టం. ప్రయోగం జీవితంలో సవాళ్లు మూలంకం వారు తమ భాగస్వామి నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. కొన్నిసార్లు సంబంధాల్లో అతిగా స్వాధీన భావాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. దీంతో అసంతృప్తి లేదా భాగస్వామితో విభేదాలు వంటివి ఏర్పడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks