ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం ఫుల్లుగా ఉంటుంది, మహారాణుల్లా జీవిస్తారు!
కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్పబడింది. సాముద్రిక శాస్త్రంలో శరీర ఆకృతి, పుట్టుమచ్చలు మొదలైన వాటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల పుట్టుమచ్చలు, గుర్తులు ఉంటే అదృష్టవంతులని చెబుతారు.
మనకి ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్పబడింది. సాముద్రిక శాస్త్రంలో మన శరీర ఆకృతి, పుట్టుమచ్చలు మొదలైన వాటి ద్వారా ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చాలా విషయాలను చెప్పవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని చోట్ల పుట్టుమచ్చలు, గుర్తులు ఉంటే అదృష్టవంతులని చెబుతారు. మీకు ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయా? అయితే కచ్చితంగా మీరు కూడా అదృష్టవంతులే.

శరీరంలో వివిధ భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం వరిస్తుందని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. పుట్టుమచ్చల ఆధారంగా శుభ సంకేతాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే మాత్రం మీ వెంటే అదృష్టం ఉంటుంది. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిలైతే మహారాణుల్లా జీవిస్తారు.
ఈ ప్రదేశాల్లోపుట్టుమచ్చలు ఉంటే అదృష్టం ఫుల్లుగా ఉంటుంది, మహారాణుల్లా జీవిస్తారు
భుజంపై పుట్టుమచ్చ:
స్త్రీ భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆమె చాలా అదృష్టవంతురాలు అని చెప్పొచ్చు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. చక్కని సౌకర్యాలతో జీవిస్తారు. ఈ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ఉదారమైన మనసుతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు.
కుడి చెంప:
సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. తక్కువ శ్రమతోనే విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా 35 ఏళ్ల వయసు తర్వాత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
ముక్కుపై పుట్టుమచ్చ:
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకైనా, స్త్రీలకైనా ముక్కుపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. ముక్కు కొన మీద పుట్టుమచ్చ ఉంటే సకల సౌకర్యాలను పొందుతూ సంతోషంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
బొటనవేలుపై పుట్టుమచ్చ:
సాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకైనా, స్త్రీలకైనా బొటనవేలుపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. బొటనవేలు మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారి విజయాన్ని ఎవరు ఆపలేరు. సక్సెస్‌తో దూసుకుపోతారు.
నుదుటిపై పుట్టుమచ్చ:
నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే కూడా అదృష్టవంతులే. ముఖ్యంగా నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే విజయాలను అందుకుంటారు. 35 ఏళ్ల తర్వాత వీరి జీవితం వెలుగులతో నిండి ఉంటుంది. ఆనందంగా ఉంటారు, అందరూ గౌరవిస్తారు.
పెదాలపై పుట్టుమచ్చ:
మహిళల పెదాలపై పుట్టుమచ్చ ఉంటే అది శుభప్రదం. ఇలాంటి వారు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. జీవిత భాగస్వామి కూడా ఎంతో ప్రేమిస్తారు. జీవితంలో కష్టపడాల్సిన అవసరం ఉండదు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


