మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? అయితే ఈ ఏడాది అంతా మీకు శుభాలే, అన్నింటా విజయాలే!
ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే కొత్త ఆశలు, అవకాశాలు, అదృష్టాన్ని పొందుతారు. కొత్త సంవత్సరం మీకు అనేక విధాలుగా కలిసి రాబోతోంది. మరి ఏ అక్షతాం వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
రాశుల ఆధారంగా మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెప్పవచ్చు. అలాగే వ్యక్తి యొక్క పేరులో మొదటి అక్షరం ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం ప్రతి పేరుకు కూడా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాగే ప్రయోజనాలను కూడా పొందుతారు. 2026 కొన్ని అక్షరాల వారికి బాగా కలిసి రాబోతోంది.

ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతుందా? అయితే కొత్త ఆశలు, అవకాశాలు, అదృష్టాన్ని పొందుతారు. కొత్త సంవత్సరం మీకు అనేక విధాలుగా కలిసి రాబోతోంది. మరి ఏ అక్షతాం వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? అయితే 2026లో మీకు తిరుగు ఉండదు
'ఎస్' (S) అక్షరం
మీ పేరు ఎస్‌తో మొదలవుతుందా? అయితే 2026 మీకు బాగా కలిసి రాబోతోంది. ఎస్ అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. గురువు, శని గ్రహాల స్థితి, రాశి మార్పులు, అలాగే నక్షత్ర ప్రభావాలు ఈ అక్షరం వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాయి. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చక్కటి మార్పులను చూస్తారు. శని, గురు ప్రభావాలకు అనుకూలంగా ఉంటుంది. 2026లో ఈ అక్షరం వారికి విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అనేక అవకాశాలు వస్తాయి.
గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. స్థిరత్వాన్ని పొందుతారు. అలాగే ప్రమోషన్ రావడం, జీతం పెరగడం వంటివి కూడా చూడవచ్చు. బాధ్యతలు కూడా తీసుకుంటారు. కొత్త సంవత్సరం శని గ్రహ ప్రభావం కారణంగా ఓర్పు వస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. మీ శ్రమకు తగిన గుర్తింపును కూడా పొందుతారు. ఈ ఏడాది రెండో భాగంలో మంచి నిర్ణయాలు తీసుకుని చక్కటి ఫలితాలను చూస్తారు.
పరీక్షల్లో విజయాలు
ఈ అక్షరం వారు పరీక్షల్లో విజయాలను అందుకుంటారు. ఈ ఏడాది మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్య, విదేశీ అవకాశాలను కూడా పొందడానికి వీలవుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
దాంపత్య జీవితంలో సంతోషాలు
ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతున్నట్లయితే కొత్త ఏడాది మీకు బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న అపోహలు, దూరాలు తగ్గుతాయి. ప్రేమ పెరుగుతుంది. అవగాహన ఎక్కువవుతుంది. అవివాహితులకు జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వ్యాపారులకు లాభాలు
ఈ అక్షరంతో మీ పేరు మొదలవుతున్నట్లయితే వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి పేరు తెచ్చుకుంటారు. అన్ని విధాలుగా 2026 మీకు బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


