రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకుంటాము. అంతే కాకుండా, న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యలు కూడా మన గురించి అనేక విషయాలు చెబుతాయి. మన వ్యక్తిత్వం, తీరుతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెబుతాయి. మన పేరు, పేరులో ఉండే మొదటి అక్షరం, చివరి అక్షరం కూడా ఎన్నో విషయాలను తెలుపుతుంది.

పేరులో చివరి అక్షరం ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని మీకు తెలుసా? న్యూమరాలజిస్టుల ప్రకారం, ఈరోజు పేరులో చివరి అక్షరం ద్వారా మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి.
మీ పేరులో చివరి అక్షరం ఆధారంగా మీ వ్యక్తిత్వం తెలుసుకోండి
ఓ అక్షరం:
మీ పేరు ‘ఓ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, చదువులో మీరు ఎప్పుడూ ముందుంటారు. అలాగే కొత్త ఆలోచనలతో ఎల్లప్పుడూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. క్రియేటివిటీని కూడా రోజు రోజుకీ పెంచుకుంటూ వెళ్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు.
ఏ అక్షరం:
మీ పేరు ‘ఏ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. మీలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలకు మీరు ఏ మాత్రం ప్రభావితం కారు. ఈ అక్షరంతో మీ పేరు ముగుస్తున్నట్లయితే తేలికగా ప్రేమలో పడిపోతారు. జీవిత భాగస్వామిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. కుటుంబానికి ఈ అక్షరం వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఈ అక్షరం:
మీ పేరు ‘ఈ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మీరు మారతారు, మీ జీవితాన్ని మార్చుకుంటారు. అలాగే ఈ అక్షరంతో పేరు ముగుస్తున్న వారు చాలా సౌమ్యులు. ఎక్కువ డ్రామా చేసే వారిని మీరు ఏ మాత్రం ఇష్టపడరు. ఇతరుల అభిప్రాయాలను తీసుకోరు, సొంతంగా ఎదగడానికి ఇష్టపడతారు.
ఆర్ అక్షరం:
మీ పేరు ‘ఆర్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, మీరు ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వివిధ రకాల దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తితో మీ పనులను పూర్తి చేస్తారు. చురుకుగా ఉంటారు.
ఎస్ అక్షరం:
{{/usCountry}}మీ పేరు ‘ఆర్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, మీరు ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వివిధ రకాల దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తితో మీ పనులను పూర్తి చేస్తారు. చురుకుగా ఉంటారు.
ఎస్ అక్షరం:
{{/usCountry}}మీ పేరు ‘ఎస్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఏ పని చేసినా అంకితభావంతో చేస్తారు. అలాగే మీరు సహ ఉద్యోగులు మీ పనిని చూసి అసూయపడేలా పనులను పూర్తి చేస్తారు. సులువుగా సక్సెస్‌ను అందుకుంటారు. ఫ్యాషన్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు.
ఎం అక్షరం:
మీ పేరు ‘ఎం’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, క్రమశిక్షణతో ఉంటారు. ఎప్పుడూ మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. విశాల దృక్పథంతో ఉంటారు.
ఎల్ లేదా హెచ్ అక్షరం:
మీ పేరు ‘ఎల్’ లేదా ‘హెచ్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఇతరుల పట్ల విశ్వాసంతో ఉంటారు. నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయరు. ఎవరు మిమ్మల్ని సంతోషపెట్టాలని జీవించరు. మీకోసం మీరే జీవిస్తారు. మీరు అనుకున్నది కచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది.