మీ పేరులో చివరి అక్షరం మీరేంటో చెప్తుంది.. వారు చాలా తెలివైనవారు, తేలికగా ప్రేమలో పడిపోతారు!

మన పేరులో చివరి అక్షరం ఇన్ని విషయాలను చెప్తుందని మీకు తెలుసా? న్యూమరాలజిస్టుల ప్రకారం ఈరోజు మీ పేరులో ఉండే చివరి అక్షరం ద్వారా మీరేంటో తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి తీరు, ప్రవర్తన వేరుగా ఉంటుంది. చివరి అక్షరం ఆధారంగా మీకు కూడా తెలియని చాలా విషయాలు ఇక్కడ తెలుసుకోండి.  

Published on: Apr 6, 2026, 15:31:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకుంటాము. అంతే కాకుండా, న్యూమరాలజీలో ఉన్న రాడిక్స్ సంఖ్యలు కూడా మన గురించి అనేక విషయాలు చెబుతాయి. మన వ్యక్తిత్వం, తీరుతో పాటు భవిష్యత్తు గురించి కూడా చెబుతాయి. మన పేరు, పేరులో ఉండే మొదటి అక్షరం, చివరి అక్షరం కూడా ఎన్నో విషయాలను తెలుపుతుంది.

మీ పేరులో చివరి అక్షరం మీరేంటో చెప్తుంది.. వారు చాలా తెలివైనవారు (pinterest)
మీ పేరులో చివరి అక్షరం మీరేంటో చెప్తుంది.. వారు చాలా తెలివైనవారు (pinterest)

పేరులో చివరి అక్షరం ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఇది మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని మీకు తెలుసా? న్యూమరాలజిస్టుల ప్రకారం, ఈరోజు పేరులో చివరి అక్షరం ద్వారా మీరు ఎలాంటి వారో ఇక్కడ తెలుసుకోండి.

మీ పేరులో చివరి అక్షరం ఆధారంగా మీ వ్యక్తిత్వం తెలుసుకోండి

ఓ అక్షరం:

మీ పేరు ‘ఓ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, చదువులో మీరు ఎప్పుడూ ముందుంటారు. అలాగే కొత్త ఆలోచనలతో ఎల్లప్పుడూ చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. క్రియేటివిటీని కూడా రోజు రోజుకీ పెంచుకుంటూ వెళ్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జాగ్రత్తగా తగిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు.

ఏ అక్షరం:

మీ పేరు ‘ఏ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, మీరు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. మీలో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇతరుల అభిప్రాయాలకు మీరు ఏ మాత్రం ప్రభావితం కారు. ఈ అక్షరంతో మీ పేరు ముగుస్తున్నట్లయితే తేలికగా ప్రేమలో పడిపోతారు. జీవిత భాగస్వామిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. కుటుంబానికి ఈ అక్షరం వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ అక్షరం:

మీ పేరు ‘ఈ’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. జీవితంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా మీరు మారతారు, మీ జీవితాన్ని మార్చుకుంటారు. అలాగే ఈ అక్షరంతో పేరు ముగుస్తున్న వారు చాలా సౌమ్యులు. ఎక్కువ డ్రామా చేసే వారిని మీరు ఏ మాత్రం ఇష్టపడరు. ఇతరుల అభిప్రాయాలను తీసుకోరు, సొంతంగా ఎదగడానికి ఇష్టపడతారు.

ఆర్ అక్షరం:

మీ పేరు ‘ఆర్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, మీరు ఫ్యాషన్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వివిధ రకాల దుస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తితో మీ పనులను పూర్తి చేస్తారు. చురుకుగా ఉంటారు.

ఎస్ అక్షరం:

మీ పేరు ‘ఎస్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఏ పని చేసినా అంకితభావంతో చేస్తారు. అలాగే మీరు సహ ఉద్యోగులు మీ పనిని చూసి అసూయపడేలా పనులను పూర్తి చేస్తారు. సులువుగా సక్సెస్‌ను అందుకుంటారు. ఫ్యాషన్ పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు.

ఎం అక్షరం:

మీ పేరు ‘ఎం’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, క్రమశిక్షణతో ఉంటారు. ఎప్పుడూ మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. విశాల దృక్పథంతో ఉంటారు.

ఎల్ లేదా హెచ్ అక్షరం:

మీ పేరు ‘ఎల్’ లేదా ‘హెచ్’ అక్షరంతో ముగుస్తున్నట్లయితే, ఇతరుల పట్ల విశ్వాసంతో ఉంటారు. నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయరు. ఎవరు మిమ్మల్ని సంతోషపెట్టాలని జీవించరు. మీకోసం మీరే జీవిస్తారు. మీరు అనుకున్నది కచ్చితంగా నెరవేర్చుకుంటారు. ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More