Personality Test: మహిళల పాదాలు ఇలా ఉంటే ఆ భర్తకు ఐశ్వర్యం, రాజభోగాలు.. మీ పాదాల ప్రకారం మీరు ఎలా ఉంటారో తెలుసుకోండి!
మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన చేతిరాత, మన పేరులో మొదటి అక్షరం, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, రాశులు ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే పాదాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పాదాలు, కాలివేళ్లు మనకు తెలియని ఎన్నో విషయాలను చెబుతాయి. మరి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి.
ఒక్కో మనిషి వ్యక్తిత్వం తీరు ఒక విధంగా ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన చేతిరాత, మన పేరులో మొదటి అక్షరం, పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, రాశులు ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే పాదాలను బట్టి కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పాదాలు, కాలివేళ్లు మనకు తెలియని ఎన్నో విషయాలను చెబుతాయి.
Personality Test: మహిళల పాదాలు ఇలా ఉంటే ఆ భర్తకు ఐశ్వర్యం, రాజభోగాలు (pinterest)
ఒక్కో వ్యక్తి తీరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొంత మందికి అవి బలాలు అయితే, కొంత మందికి అవి బలహీనతలు అవవచ్చు. అయితే ఇక్కడ ఈరోజు పాదాల రూపురేఖలు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పాదాలను బట్టి మీరు ఎలా ఉంటారో తెలుసుకోవచ్చు. మరి మీరు ఎలాంటి వారో ఇప్పుడే తెలుసుకోండి.
మీ పాదాల ప్రకారం మీరు ఎలాంటి వారో తెలుసుకోండి
పాదాలు వెడల్పుగా ఉన్నట్లయితే వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. అదే పాదాలు సన్నగా ఉంటే ఇతరులకు వారి పనులను అప్పగించడానికి ఇష్టపడతారు. పాదం మధ్యభాగం వంపు లేకుండా నిదానంగా ఉన్నట్లయితే వారు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. పాదం అడుగుభాగం వంపు తిరిగి ఉంటే మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరులతో ఫ్రెండ్లీగా ఉంటారు కానీ వారికంటూ కొంత సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు.
పెద్ద పాదాలు, చిన్న పాదాలు
పెద్దగా పాదాలు ఉన్నట్లయితే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పాదాలు చిన్నగా ఉన్నట్లయితే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.
కాలి బొటనవేలు పొడుగ్గా ఉంటే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు.
అదే బొటనవేలు పక్కవేలు అన్నివేళ్ల కంటే పొడవుగా ఉంటే మంచి నాయకుడవుతాడు.
చక్కగా వేళ్ళు అన్నీ ఒక వరుసలో మార్చినట్లయితే నిజాయితీగా ఉంటారు.
వేళ్ల మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటే ఎక్కువగా మాట్లాడతారు, హాస్యాన్ని ఇష్టపడతారు.
మహిళల పాదాలు, వాటి వెనుక అర్ధం
మహిళల పాదాలు భర్త జీవితాన్ని, సంతోషాన్ని, భవిష్యత్తును, కష్టాలను తెలుపుతాయని అంటారు. మహిళ పాదం అడుగుభాగంలో ధ్వజం, చక్రం లేదా స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే భర్తను ఒక మంచి రాజుగా చేస్తాయని నమ్మకం. పైగా వారు రాజభోగాలను అనుభవిస్తారు.
మహిళ కాలి రెండవ వేలు అన్ని వేళ్ల కంటే పెద్దగా ఉంటే వారు చాలా డామినేటింగ్‌గా ఉంటారు. మహిళ పాదాల్లో కమలం లేదా చక్రం గుర్తులు ఉంటే భర్త ఆనందంగా ఉంటాడు. సంపద, ఐశ్వర్యం ఎక్కువ.
కాలి మూడవ వేలు అన్ని వేళ్లతో సమానంగా ఉంటే భర్త కుటుంబ సభ్యులతో గొడవ పడడానికి ఆమె కారణమవుతుందని చెబుతారు.