Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి కుబేరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.. విపరీతమైన డబ్బు, cపాటు ఎన్నో!
ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. కొన్ని రాడిక్స్ సంఖ్యల వారికి అవి బలాలు అయితే, కొన్ని సంఖ్యల వారికి అవే బలహీనతలు కావచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
న్యూమరాలజీ నుంచి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయని చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. న్యూమరాలజీలో చూసినట్లయితే రాడిక్స్ సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ సంఖ్యల ఆధారంగా ఒక మనిషి ఎలా ఉంటారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, భవిష్యత్తు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పడానికి అవుతుంది.

ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. కొన్ని రాడిక్స్ సంఖ్యల వారికి అవి బలాలు అయితే, కొన్ని సంఖ్యల వారికి అవే బలహీనతలు కావచ్చు. ఈ తేదీల్లో పుట్టిన వారు మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టిన వారికి కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
అదృష్టం కూడా వారిని వర్తిస్తుంది
దీనితో డబ్బుకు లోటు ఉండదు. పైగా అదృష్టం కూడా వారిని వర్తిస్తుంది. జీవితంలో సక్సెస్‌ను చూస్తూనే ఉంటారు. ఆర్థికపరంగా కూడా ఏ ఇబ్బంది రాదు. మరి అదృష్టవంతులు ఎవరు? ఈ అదృష్టవంతులు మీరు ఉన్నారేమో చూసుకోండి.
ఈ తేదీల్లో పుట్టిన వారికి కుబేరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.. విపరీతమైన డబ్బు, అదృష్టంతో పాటు ఎన్నో లాభాలను పొందుతారు
రాడిక్స్ సంఖ్య 1:
ఏదైనా నెలలో ఒకటి, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఒకటి అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సూర్యుడిలాగే వారి జీవితం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. దేనికీ లోటు ఉండదు. కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. కష్టపడి పని చేస్తారు. అనుకున్న వాటిని సమయానికి పూర్తిచేస్తారు. ఏ రంగంలో అయినా సరే సక్సెస్ వారిని వర్తిస్తుంది.
పైగా ఈ తేదీల్లో పుట్టిన వారు బాగా డబ్బు సంపాదిస్తారు. తెలివిగా డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్, డబ్బు సంపాదించడం గురించి బాగా అవగాహన ఉంటుంది. అర్థం చేసుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరి కిందైనా పని చేయడం వీరికి నచ్చదు. ఈ తేదీల్లో పుట్టిన వారు సక్సెస్‌ను అందుకుంటారు. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. కుబేరుని అనుగ్రహంతో డబ్బు కొరత ఉండదు.
రాడిక్స్ సంఖ్య 5:
ఏదైనా నెలలో 5, 15, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానం, విద్య మొదలైన వాటికి కారకుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు. పైగా మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు బిజినెస్‌లో కూడా బాగా సక్సెస్‌ను అందుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి.
కుబేరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ముందుంటారు. భారీగా లాభాలను పొందుతారు. స్టాక్ మార్కెట్, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి. ఎప్పుడూ కూడా డబ్బు పురోగతిని చూస్తారు. త్వరగానే ధనవంతులైపోతారు. ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా సరే సులువుగా దాటేస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


