చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. మీరు కూడా వాస్తు ప్రకారం అనుసరించాలనుకుంటున్నారా? అది కూడా రూపాయి ఖర్చు లేకుండా వాస్తు సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే.

ఇంట్లో తరచూ గొడవలు, సంబంధాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదురైనప్పుడు కాస్త ఓపికతో ఈ పరిహారాలను పాటించండి. చాలా మంది వీటిని వాస్తు దోషాలతో ముడిపెడుతూ ఉంటారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి అనే పంచభూతాల సమతుల్యత చాలా ముఖ్యం. పంచభూతాల్లో అసమతుల్యత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఖర్చు లేకుండా ఈ సమస్యలన్నిటినీ సెట్ చేయాలంటే ఈ సులువైన పరిహారాలను ప్రయత్నించండి.
బాత్రూంలో పటిక లేదా ఉప్పు
వాస్తు ప్రకారం బాత్రూంలో ఒక గాజు గిన్నె పెట్టి పటిక ఉంచండి. కొందరు దీనికి బదులు ఉప్పును కూడా వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన ప్రతికూలత తగ్గుతుంది. పైగా పటిక లేదా ఉప్పు ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి కూడా సహాయం చేస్తాయి. ఇలా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.
ఈశాన్య మూలలో వంటగదిని నిర్మించవద్దు
వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో వంటగది ఉండకూడదు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలను జలతత్వానికి సంబంధించినదిగా భావిస్తారు. అలాగే ఆగ్నేయ దిశను అగ్ని మూలకంగా భావిస్తారు. కనుక ఈశాన్య మూలలో వంటగది ఉండడం సరైనది కాదు. ఆగ్నేయం వైపు వంటగది ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఈ పొరపాటు చేయకుండా చూసుకోవాలి.
నీళ్లలో ఉప్పు కలపండి
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పును కలపండి. ఇది ప్రతికూల శక్తిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. సానుకూల శక్తిని వ్యాపించేటట్టు చేస్తుంది. అలాగే ఇల్లు పరిశుభ్రంగా కూడా ఉంటుంది.
ఉత్తర దిశలో నీళ్లు
{{/usCountry}}ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పును కలపండి. ఇది ప్రతికూల శక్తిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. సానుకూల శక్తిని వ్యాపించేటట్టు చేస్తుంది. అలాగే ఇల్లు పరిశుభ్రంగా కూడా ఉంటుంది.
ఉత్తర దిశలో నీళ్లు
{{/usCountry}}ఉత్తర దిశను సంపద, అవకాశాల దిశ అంటారు. కుబేరుడి దిశ కూడా అని అంటారు. అయితే జలతత్వాన్ని సమతుల్యం చేయడానికి ఉత్తర దిశలో నీటి పాత్రను పెట్టండి. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది.
ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక గుర్తు వేయండి
ఇది శుభం, అదృష్టానికి ప్రతీక. చాలా ఇళ్లల్లో ప్రధాన ద్వారం దగ్గర కుంకుమ, చందనంతో స్వస్తిక గుర్తు వేస్తారు. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది.
ఇల్లు చీకటిగా ఉండకూడదు
ఇల్లు చీకటిగా ఉండకూడదు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో వెలుతురు ఉండేటట్టు చూసుకోండి. ముఖద్వారం దగ్గర కూడా చీకటిగా లేకుండా చూసుకోండి. అలా వెలుతురుతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సిరిసంపదలు కూడా కలుగుతాయి.