సోమవతి అమావాస్య రోజే మిథున సంక్రాంతి రావడం అత్యంత అరుదైన, పవిత్రమైన ఘట్టంగా పండితులు భావిస్తున్నారు. ఈ రెండు ఒకే రోజు కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్న సూర్య భగవానుడు జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రాశిలో అప్పటికే బుధుడు ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడనుంది.

"ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన ధనలాభాన్ని, కెరీర్‌లో ఊహించని పురోగతిని తెచ్చిపెడుతుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. అయితే, ఈ యోగం ఎక్కువ రోజులు ఉండదు. జూన్ 22వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి మారడం వల్ల ఈ బుధాదిత్య రాజయోగం ముగుస్తుంది. ఆ తర్వాత జూలై వరకు బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు.
మిథున సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలు
మిథున సంక్రాంతి రోజున సూర్య ఆరాధన చేయడం, దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ పవిత్ర దినాన చాలా మంది ఇళ్లలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి దానాలు చేయడం ఉత్తమం. అలాగే పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలమైనది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి.. ఈ రోజున అన్నదానంతో పాటు విసనకర్రలు, గొడుగులు, చల్లని నీరు, మట్టి కుండలు, కాలకనుగుణంగా దొరికే పండ్లను దానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి.
బుధాదిత్య రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులు
మిథున రాశి
మీ రాశిలోనే సూర్య, బుధుల కలయిక జరుగుతోంది. బుధుడి ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. కెరీర్, వ్యాపార రంగాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. లాభాలు కూడా ఆశించిన స్థాయిలో ఉంటాయి.
సింహ రాశి
{{/usCountry}}మీ రాశిలోనే సూర్య, బుధుల కలయిక జరుగుతోంది. బుధుడి ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. కెరీర్, వ్యాపార రంగాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. లాభాలు కూడా ఆశించిన స్థాయిలో ఉంటాయి.
సింహ రాశి
{{/usCountry}}సింహ రాశికి సూర్యుడే అధిపతి. అందువల్ల బుధుడి కలయిక మీకు విశేష ప్రయోజనాలను ఇస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి, నిమిషాల్లో పనులు పూర్తవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.
కన్యా రాశి
సూర్యుడు, బుధుడి అనుగ్రహం వల్ల కన్యా రాశి వారికి వృత్తిపరంగా తిరుగుండదు. ఉద్యోగంలో పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి, వ్యక్తిగత జీవితంలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరగడమే కాకుండా సమాజంలో హోదా కూడా పెరుగుతుంది.
తులా రాశి
ఈ కాలంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. గతంలో మిమ్మల్ని వేధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోతాయి. మిథున రాశిలో గ్రహాల అనుకూలత వల్ల మీరు తీసుకునే సరైన నిర్ణయాలతో ఆస్తులను విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నమ్మకాలు, పౌరాణిక గ్రంథాలపై ఆధారపడి ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.