గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడడం సహజం. పంచాంగం ప్రకారం త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది అనేక రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకు రాబోతోంది. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక విజయాలను కూడా అందుకుంటారు.
త్రిగ్రాహి యోగం:

పంచాంగం ప్రకారం డిసెంబర్ 6న బుధుడు వృశ్చిక రాశిలో తిరోగమనంలో ఉంటాడు. డిసెంబర్ 29న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే విధంగా చంద్రుడు డిసెంబర్ 17న వృశ్చిక రాశిలోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత డిసెంబర్ 19న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి అడుగుపెడతాడు, ఆ తర్వాత డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 17 నుంచి చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించే వరకు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తారు.
మూడు రాశులకి బావుంటుంది
ఈ మూడు గ్రహాల కలయిక అనేక రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారికి తెలివితేటలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు ఎక్కువ అవుతాయి, ప్రశాంతంగా ఉంటారు. మరి ఏ మూడు రాశులకి సమయం బావుంటుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిగ్రాహి యోగంతో ఈ మూడు రాశుల వారికి బోలెడు లాభాలు:
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఎక్కువ సపోర్ట్ పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. గౌరవం, మర్యాదలను సంపాదిస్తారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.
2.మకర రాశి:
{{/usCountry}}మేష రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఎక్కువ సపోర్ట్ పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. గౌరవం, మర్యాదలను సంపాదిస్తారు. కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కూడా ఇది మంచి సమయం.
2.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి త్రిగ్రాహి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. పని ప్రదేశంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకూ ఇది శుభ సమయం. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసి వస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది.
3.కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారులకూ ఇది బాగా కలిసి వస్తుంది. అడ్డంకులన్నీ తొలగిపోతాయి.