పునర్వసు నక్షత్రంలోకి కుజుడు.. ఈ 3 రాశులకు కెరీర్, డబ్బు విషయంలో జాక్‌పాట్!
కుజుడు సెప్టెంబర్ 2, 2026న మధ్యాహ్నం 1:25 గంటలకు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించి, సెప్టెంబర్ 24 వరకు అక్కడే సంచరిస్తాడు. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు కాగా, కుజుడిని శక్తి, ధైర్యం, భూమికి కారక గ్రహంగా భావిస్తారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మాత్రం సమస్యలు ఎదురవుతాయి.

కుజుడు సెప్టెంబర్ 2, అంటే రేపు, మధ్యాహ్నం 1:25 నిమిషాలకు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 24 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తాడు. పునర్వసు నక్షత్రానికి అధిపతి వచ్చేసి గురువు. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, గురువుని అదృష్టం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. కుజుడిని శక్తి, ధైర్యం, భూమికి కారక గ్రహంగా భావిస్తారు. అయితే కుజుడి నక్షత్ర సంచారంలో మార్పు రావడంతో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం విపరీతంగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
కుజ నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి పండగే.. అనుకోని విధంగా బోలెడు లాభాలు!
1.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా భారీగా లాభాలను పొందుతారు.
కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొస్తాయి. కెరీర్‌లో ఈ రాశి వారు దూసుకెళ్లిపోతారు. దూర ప్రయాణాలు చేస్తే కూడా అవకాశాలు కలిసి వస్తాయి.
2.మకర రాశి
మకర రాశి వారికి ఇది అదృష్ట సమయం అని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఎప్పటి నుంచి నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇటు వరకు నిలిచిపోయిన పని విజయవంతంగా పూర్తి చేస్తారు. మనసుకు సంతోషం కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. కెరీర్, ఆర్థిక విషయాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.
3.కన్యా రాశి
ఈ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. కన్యా రాశి వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అదృష్టం కూడా వెతుక్కుంటూ వస్తుంది. కెరీర్, వ్యాపార రంగాల్లో కన్యా రాశి వారు ఆశించిన విజయాలను పొందుతారు.
పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలను చూస్తారు. ఆఫీస్‌లో కష్టపడి పనిచేస్తే ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను పొందుతారు. కెరీర్‌లో ఇవి విజయ అవకాశాలుగా మారుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


