జగన్నాథ రథయాత్ర సందర్భంగా పూరి క్షేత్రం భక్తకోటితో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్మాణం, అందులోని నాలుగు దివ్య ద్వారాలు, 22 మెట్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది.
జగన్నాథుని రథయాత్ర: 4 ద్వారాలు, 22 మెట్ల వెనుక ఉన్న పరమార్థం

ప్రపంచ ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఒడిశాకు తరలివచ్చారు. స్వామివారిని రథాలపై చూడడం ఒక ఎత్తు అయితే, జగన్నాథుని ఆలయంలో అడుగుపెట్టి ఆ పరమాత్మను స్మరించుకోవడం ఇంకో ఎత్తు. ఎన్నో శతాబ్దాల చరిత్ర, అందుచిక్కని రహస్యాలు ఈ ఆలయ నిర్మాణంలో ఉన్నాయి. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా?
నాలుగు దిక్కులా నాలుగు దివ్య ద్వారాలు
జగన్నాథుని ఆలయంలో నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వీటిని సింహద్వారం, వ్యాఘ్రద్వారం, హస్తిద్వారం, అశ్వద్వారం అని అంటారు. ఇవి కేవలం ప్రవేశ ద్వారాలే కాదు. ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకలుగా కూడా భావిస్తారు.
సింహ ద్వారం
సింహ ద్వారం తూర్పు వైపు ఉంటుంది. ఇది ప్రధాన ప్రవేశ ద్వారం. ద్వారం ఇరువైపులా సింహాల విగ్రహాలు ఉంటాయి. భక్తులు ఎక్కువగా ఈ ద్వారం నుంచే లోపలికి వెళ్తారు. ఆధ్యాత్మిక ఉన్నతికి, మోక్షానికి బాటలు వేసే ద్వారంగా దీనిని భావిస్తారు. అందుకే చాలామంది భక్తులు ఈ మార్గం నుంచే ఆలయంలోకి ప్రవేశిస్తారు.
వ్యాఘ్ర ద్వారం
ఇక్కడ పులి విగ్రహాలు ఉంటాయి. ధైర్యానికి, ధర్మ పరిరక్షణకు ఇది చిహ్నంగా భావిస్తారు. కోరికలను జయించి ధర్మ మార్గంలో నడవాలని ఈ ద్వారం సందేశాన్ని ఇస్తుంది. సాధువులు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు.
హస్తి ద్వారం
{{/usCountry}}ఇక్కడ పులి విగ్రహాలు ఉంటాయి. ధైర్యానికి, ధర్మ పరిరక్షణకు ఇది చిహ్నంగా భావిస్తారు. కోరికలను జయించి ధర్మ మార్గంలో నడవాలని ఈ ద్వారం సందేశాన్ని ఇస్తుంది. సాధువులు, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఈ ద్వారం గుండా ప్రవేశిస్తారు.
హస్తి ద్వారం
{{/usCountry}}ఈ ద్వారం వద్ద ఏనుగుల విగ్రహాలు ఉంటాయి. ఏనుగులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి కాబట్టి, సంపదకు, విజ్ఞానానికి ఇవి సంకేతంగా భావిస్తారు.
అశ్వ ద్వారం
ఈ ద్వారం వద్ద గుర్రాల విగ్రహాలు ఉంటాయి. ఇది విజయానికి, వీరత్వానికి ప్రతీక. యుద్ధ భంగిమలో ఉన్న జగన్నాథుడు, బలభద్రుల రూపాలు ఇక్కడ కనిపిస్తాయి.
22 మెట్ల రహస్యం
ఆలయ ప్రవేశంలో ఉండే 22 మెట్లను బైసీ పహాచా అని అంటారు. ఈ 22 మెట్లు మనిషి జీవితంలో ఉండే 22 రకాల బలహీనతలు, లోపాలకు సంకేతంగా భావిస్తారు. ఈ మెట్లు ఎక్కేటప్పుడు భక్తులు తమలోని అహంకారం, చెడు ఆలోచనలను వదిలి పెట్టి భగవంతుని శరణు కోరుతారని ప్రతీతి.
ముఖ్యంగా వీటిలో మూడో మెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని యమశిల అని అంటారు. జగన్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఈ మూడో మెట్టును తొక్కకూడదని నమ్మకం. అలా చేస్తే భక్తులు పొందిన పుణ్యం తగ్గిపోతుందని చెబుతారు. అందుకే లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.